గుడ్ న్యూస్.. దగ్గు శబ్దంతో కరోనా నిర్ధారణ.. సరికొత్త యాప్..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని  నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక విధంగా మహమ్మారి వైరస్ పంజా విసురుతూ ప్రపంచాన్ని మొత్తం వణికిస్తూ నే ఉంది. చైనాలో వెలుగులో కి వచ్చిన మహమ్మారి వైరస్  ప్రస్తుతం చైనాలో తగ్గుముఖం పట్టింది కానీ ప్రపంచాన్ని మొత్తం వీడటం లేదు ఈ రక్కసి. ఇక ప్రస్తుతం కరోనా  వైరస్ కి సరైన వ్యాక్సిన్ అందుబాటు లో లేని నేపథ్యం లో.. ప్రస్తుతం అందరికీ ప్రత్యామ్నాయమే దిక్కుగా  మారిపోయిన విషయం తెలిసిందే .


 కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా రోగుల ను సత్వరంగా గుర్తించడమే ప్రస్తుతం అన్ని దేశాల ప్రభుత్వాల ముందు ఉన్న మొదటి ఆయుధం. కానీ ప్రస్తుతం చాలా మందిలో వైరస్ లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ పాజిటివ్ అని వస్తున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో తమకు కరోనా వైరస్ సోక  లేదు అని భావిస్తు సాధారణంగానే అందరిలో తిరగడం వల్ల మరింత మందికి కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుంది తద్వారా రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది.



 ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను కనిపెట్టేందుకు ఎన్నో ఆవిష్కరణ లు  కూడా  తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సరికొత్త ఆవిష్కరణలు కూడా తెరమీదికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరోనా సమస్యకు చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవ్యక్తి దగ్గినప్పుడు మనకు వినబడని  శబ్దాలను కూడా గ్రహించి కరోనా వైరస్ నిర్ధారణ చేయగలిగేలా యాప్ రూపొందుతుందని ఇటీవలే మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ క్రమంలోనే కరోనా రోగులు దగ్గిన  శబ్దాన్ని 98.5 శాతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేసి పరీక్షలు జరిపారు. యాప్స్ కచ్చితమైన ఫలితాలు వచ్చాయని పరిశోధకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: