నీవు లేని జీవితం వద్దు.. భార్య సమాధి వద్దే భర్త కూడా..?
కానీ వారి సంతోషాన్ని చూసి విధి ఓర్వలేక పోయింది. చివరికి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. భార్యను దూరం చేసి భర్తను ఒంటరివాన్ని చేసిన విధి ఆ తర్వాత భర్తను ఆత్మహత్య చేసుకునేలా చేసి పిల్లలను అనాథలను చేసింది. ఈ విషాదకర ఘటన ఎంతోమందిని కన్నీళ్లు పెట్టిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో జరిగింది మనసును కలచి వేసే ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్న భార్య దూరం కావడానికి భర్త జీర్ణించుకోలేకపోయాడు. భార్య మరణంతో కుంగిపోయిన భర్త చివరికి భార్య సమాధి వద్ద ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఇక తండ్రి మరణంతో పిల్లలు అనాధలుగా మారిపోయారు.
సిద్దిపేట జిల్లా ఆరేపల్లి లో రాజు రమ్య అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వీరికి వైష్ణవి సిరి అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు ఇక ఉన్నంతలో హాయిగా జీవనం సాగిస్తున్న తరుణంలో అనుకోని ఘటన కుటుంబంలో చోటుచేసుకుంది. క్యాన్సర్ మహమ్మారి భార్యపై పంజా విసిరింది దీంతో క్యాన్సర్ తో పోరాడుతూ చివరికి రమ్య నాలుగేళ్ల క్రితం ప్రాణాలు వదిలింది. ఇక ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న భార్య దూరమవ్వడంతో రాజు జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత మద్యానికి బానిస గా మారిపోయాడు ఎన్నోసార్లు నువ్వు లేకుండా ఉండలేను నీ దగ్గరకు వచ్చేస్తా అంటూ ఏడ్చేవాడు ఇటీవలే పొలం దగ్గరికి వెళ్లిన రాజు భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.