బాలయ్య చిన్నల్లుడు ఫిక్స్ అయిపోయాడు...మరి బాబు ఏం చేస్తారో?

M N Amaleswara rao
రాజకీయాల్లో కష్టంతో పాటు అదృష్టం కూడా కాస్త కలిస్తే గెలుపు సులువు అవుతుంది. అయితే 2019 ఎన్నికల్లో ఎంత కష్టపడిన అదృష్టం లేక చాలామంది టీడీపీ నేతలు అతి తక్కువ మెజారిటీలతో ఓటమి పాలయ్యారు. అలా ఎంపీగా పోటీ చేసిన వాళ్ళలో చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయిన నాయకుడు శ్రీభరత్. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడుగా, నారా లోకేష్ తోడల్లుడుగా, దివంగత నేత ఎం‌వి‌వి‌ఎస్ మూర్తి మనవాడుగా రాజకీయాల్లోకి వచ్చిన భరత్...2019 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు,

కేవలం 4 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధిపై ఓడిపోయారు. అయితే ఓడిపోయాక భరత్ కాస్త రాజకీయాలకు దూరంగా జరిగారు. తమ గీతం విద్యా సంస్థలని నడిపించుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ టీడీపీని వీడటంతో, ఆ నియోజకవర్గానికి వెళ్ళి టీడీపీకి అండగా నిలిచారు.

అయితే శ్రీ భరత్ విశాఖ పార్లమెంట్‌పై ఫుల్ గ్రిప్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. మొన్న ఎన్నికల్లో జనసేన తరుపున జే‌డి లక్ష్మీనారాయణ బరిలో ఉండటం వల్ల టీడీపీ ఓట్లు చీలిపోయి భరత్ ఓడిపోయారు. కానీ ఈ సారి అలా జరగకుండా పక్కా ప్లాన్‌తో భరత్ ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన మరోసారి ఎంపీగానే పోటీచేస్తానని భరత్ చెప్పేశారు. తనకు ఎమ్మెల్యే పదవి సూట్ కాదని, ఎంపీగానే ఉంటానని చెబుతున్నారు. దీని బట్టి చూస్తే భరత్ ఎంపీగానే బరిలో దిగడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. అయితే భరత్ ఏమో మళ్ళీ ఎంపీగా దిగుతానని ఫిక్స్ అయిపోయారు. కానీ మొన్న ఎన్నికల్లోనే భరత్‌కు సీటు దక్కడం చాలా కష్టమైంది. బాలయ్య కల్పించుకోవడంతో సీటు వచ్చింది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: