వ్యాక్సిన్ వద్దే వద్దు అంటున్న వైద్యరంగం.. ప్రభుత్వానికి షాక్..?

praveen
దాదాపు ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ భారతదేశాన్ని మాత్రం కరోనా  వైరస్ వదిలిపెట్టడం లేదు అనే విషయం తెలిసిందే.  చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ భారత దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇక కరోనా వైరస్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిన భారత ప్రభుత్వం అందులో విజయవంతం అయింది అని చెప్పాలి.  ప్రస్తుతం భారత్లో రికవరీ రికార్డు స్థాయిలో ఉంది . కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది అదే సమయంలో  వ్యాక్సిన్ శరవేగంగా క్లినికల్ ట్రయల్స్ కూడా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  దేశ ప్రజానీకం మొత్తం వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని  ఎదురు చూస్తున్నాను.



 అయితే మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రస్తుతం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న  విషయం తెలిసిందే.  ప్రజలందరూ వ్యాక్సిన్  కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఇప్పటికే పలుమార్లు సంకేతాలు కూడా ఇచ్చింది. ముఖ్యంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైద్య సిబ్బందికి పోలీస్ సిబ్బందికి పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్  ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా వారియర్స్ వివరాలు కూడా సేకరిస్తుంది ప్రభుత్వం. అయితే ఇలా వివరాలు సేకరిస్తున్న సమయంలో కొంత మంది వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వద్దు అని చెబుతున్నారట.




 ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ పూర్తయినప్పటికీ ప్రస్తుతం ప్రాథమిక దశలో ఇస్తున్న వ్యాక్సిన్ లో  ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్న కొంతమంది వైద్యులు... కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకోమని చెబుతున్నారట. అయితే దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.. కరోనా వైరస్ ప్రాణాలు తీస్తున్న సమయంలోనే ముందడుగు వేసి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన వైద్యులు ప్రస్తుతం ఇలా వెనకడుగు వేయాలి అన్న నిర్ణయం మాత్రం సరి కాదు అని అంటున్నారు. ప్రభుత్వం వైద్యులకు ముందస్తు ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి వ్యాక్సిన్ ఇస్తుందని అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: