వామ్మో.. లాక్ డౌన్ ఇంతమంది అప్పులు చేశారా..?
ఇలా క్రమక్రమంగా కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయారు. ఇక అప్పటికి నెలవారి జీవితం మీద ఆధారపడి జీవించేవారు పరిస్థితిని దుర్భర స్థితిని గడిపారు. ఈఎంఐ చెల్లించలేక చేతిలో చిల్లిగవ్వ లేక అయోమయంలో పడిపోయారు. కుటుంబ పోషణ భారమై ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అప్పులు కూడా చేసిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు కుదురుకోగానే అప్పులు తీర్చేయాలని భావించి ఎంతోమంది కరోనా సంక్షోభం సమయంలో అప్పులు చేశారు. అయితే లాక్ డౌన్ సమయంలో భారీగా అప్పులు చేసినట్టు ఇటీవలే ఓ సంస్థ వెల్లడించింది.
కరోనా పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారమై ఉపాధి కరువై దాదాపుగా 46 శాతం మంది భారతీయులు అప్పు చేశారని ఇటీవలే హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోనా లాక్డౌన్ సమయంలో ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులను తొలగించడం లేదా ఉద్యోగుల వేతనాలు భారీగా కోతలు విధించడం కారణంగా దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని.. ఎంతో మంది కుటుంబ పోషణ కోసం తమ స్నేహితులు బంధువుల దగ్గర అప్పులు చేశారు అన్న విషయం సర్వేలో తేలింది అని హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ వెల్లడించింది.