అమెరికా అధ్యక్ష ఎన్నికలు : సుప్రీం కోర్టుకు వెళతారా..?
ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు విడుదల అవుతుండగా రికార్డు స్థాయిలో ఓటింగ్ సాధించారు జో బైడెన్. గత వందేళ్లలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో జో బైడెన్ ఓట్లు సాధించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అభ్యర్థులు కోర్టులకు వెళ్ళడం మామూలుగా జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ అభ్యర్థి అధికారంలో ఉన్న ప్రాంతాల్లో అవకతవకలు జరిగాయని రిపబ్లికన్ అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వెంటనే అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఆపాలి అంటూ సుప్రీం కోర్టు కు వెళ్తాను అంటూ ట్రంప్ చెబుతున్నట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో కూడా జార్జిబుష్ జూనియర్ కూడా ఇలాగే సుప్రీంకోర్టుకు వెళ్లారు . ఇక ఆ సమయంలో ఏకంగా ఫలితాల కోసం సుప్రీం కోర్టుకు వెళ్లగా.. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో నెలరోజుల వరకు ఫలితాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ కూడా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అమెరికా లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది.