పాఠశాలల్లో కరోనా వస్తే.. మంత్రి కీలక వ్యాఖ్యలు..?
రోజు విడిచి రోజు విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు కేవలం ఒంటిపూట వరకు మాత్రమే విద్యార్థులకు విద్యాబోధన చేసి మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపించేందుకు నిర్వహించింది జగన్ సర్కార్. అయితే జగన్ సర్కారు నిర్ణయించినట్టు గానే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అయ్యాయి కానీ మొదటి రోజు నుంచే పాఠశాలలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వెలుగులోకి వస్తుండడం మాత్రం ఆందోళనకరంగా మారిపోయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపాలి అంటేనే భయపడిపోతున్నారు.
ఇక పాఠశాలలో కరోనా వైరస్ కేసులు బయట పడుతున్న నేపథ్యంలో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రభుత్వ స్కూళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీని కోసం ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. స్కూళ్లలో కరోనా సోకిన విద్యార్థులను టీచర్లను కూడా ఐసోలేటెడ్ చేశాము అంటూ తెలిపారు. మూడు వారాల తర్వాత 9, 10 తరగతులు నిర్వహించడం పై కీలక నిర్ణయం తీసుకుంటామంటూ తెలిపిన ఆయన.. నిన్న మొన్నటి వరకు వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు అంతకుముందు కరోనా నిర్ధారిత పరీక్షలు చేసిన అంటూ తెలిపారు.