జగన్ ఈ విషయాల్లో ఎందుకు వైఫల్యం పొందుతున్నారు..?
ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు.. ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చాక జగన్ రాష్ట్రంలో చేసిన పనులు భవిష్యత్ ను దృష్టి లో ఉంచుకుని చేసినవే.. ఇప్పుడు ఆ పనులు చేస్తే వెంటనే ఫలితం రాకపోయినా భవిష్యత్ లో ఆ పనితనం తప్పకుండా తెలుస్తుంది అనుకున్నారు.. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది..జగన్ చాలా విషయాల్లో దూకుడుగా వెళ్ళి ముక్కు గుద్దేసి వెనక్కు వస్తున్నారు. దీంతో ఆయనకు ఆవేశం పెరుగుతోంది, చూసే జనాలకు ఆయాసం వస్తోంది.ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు ఎపుడు నిర్వహించాలి అన్నది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ జగన్ చేసుకున్న పాపం ఏంటో అంత బండ మెజారిటీ వచ్చి కూడా ఆయన్ని చాలా సులువుగా పక్కన పెట్టేస్తున్నారు. పైగా ప్రతిపక్షాలు కోరుకున్నట్లుగా ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. మళ్ళీ జరగబోతున్నాయి.
అంటే ఇక్కడ జగన్ సర్కార్ ఫెయిల్యూర్ గానే చూడాలి. మరో విషయం ఏంటంటే జగన్ మూడు రాజధానులు అన్నారు, అది ఆగిపోయింది. ముప్పయి లక్షల ఇళ్ళ పట్టాలు అని గట్టిగా చెప్పుకున్నారు. అది కూడా అమలు కాలేదు, ఇంగ్లీష్ మీడియం అన్నా ఆచరణలో ఆమడ దూరం ఉంది. ఇలా జగన్ తాను ఒక సీఎం గా చేయాల్సినవి ఎందుకు చేయలేకపోతున్నారో సమీక్షించుకోవాల్సిందే. జగన్ ఎన్నికైన కొత్తల్లో రాజకీయ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మాట అన్నారు. భారీ మెజారిటీలు వచ్చిన ప్రభుత్వాలు ఎపుడూ ప్రమాదమే అని, ఇపుడు జగన్ సర్కార్ ని చూస్తే అదే నిజం అనిపిస్తోంది. ఇక్కడ మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్ పేయిలను తప్పకుండా గుర్తు చేసుకోవాలి. వారి అపారమైన అనుభవంతో మైనారిటీ, సంకీర్ణ ప్రభుత్వాలను కూడా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. మరి దీన్ని చూసి అయినా జగన్ ఏమైనా నేర్చుకుంటారా.