పాకిస్తాన్లో టెన్షన్ మొదలైంది.. ఎందుకో తెలుసా..?
ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో మొన్నటి వరకు ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం చైనా వేచి చూస్తోంది అన్న విషయం తెలిసిందే. ఒకవేళ మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అధికారంలోకి వస్తే భారత్తో యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి అనే విషయం ప్రస్తుతం ప్రపంచ దేశాల మొత్తం గ్రహిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన నేపథ్యంలో ఇక పాకిస్తాన్ లో సరికొత్త భయం పట్టుకుంది.
చైనా భారత్ మధ్య యుద్ధం తలెత్తితే భారత్ ఎక్కడ పాకిస్థాన్ ను మట్టికరిపిస్తుందో అన్న భయం ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం లో పట్టుతుంది. ముందుజాగ్రత్త చర్యలు కూడా చేపడుతుంది పాకిస్థాన్. రాత్రిపూట సరిహద్దులో పహారా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్ ప్రభుత్వం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ లో ఎంతో శక్తివంతమైన యుద్ధ విమానాలు గా ఉన్న ఎఫ్ 16 యుద్ధ విమానాలతో పహారా కాస్తుంది పాకిస్తాన్. న్యూక్లియర్ కేంద్రాల వద్ద ఎఫ్ 16 యుద్ధ విమానాలతో పహారా కాస్తూ ఉండడం చూస్తుంటే పాకిస్తాన్ ఎంత భయంతో వణికి పోతుంది అన్నది అర్థం అవుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.