ప్రాజెక్టు విషయంలో మాటలయుద్ధం !

NAGARJUNA NAKKA
పోలవరం ప్రాజెక్టు విషయంలో పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయని....అంచనాల పెంపు వెనుక గుట్టు తేల్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నాడు అధికారులు, చంద్రబాబు కలిసి ప్రభుత్వ భూములకు కూడా పరిహారం కింద లెక్కగట్టారని ఆరోపిస్తోంది. అంచనాల పెంపు అక్రమం అయితే .. కేంద్రం ఇప్పుడు  ఇచ్చిన ధరలకే రాష్ట్రం ప్రాజెక్టును కట్టాలి అంటూ సవాళ్లు విసురుతోంది.

పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కేంద్రం తాజా ప్రతిపాదనలు.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సిఎం జగన్మోహన్ రెడ్డి  కేంద్రానికి లేఖ రాయగా.... గతంలోనే కేంద్రం ఒప్పుకుందంటూ టీడీపీ చెబుతోంది. అయితే బీజేపీ మాత్రం, గతంలో అక్రమాలు జరిగాయని... అంచనాల పెంపు వెనుక గుట్టు తేల్చాలని డిమాండ్ చేస్తోంది. నాడు అధికారులు, చంద్రబాబు కలిసి ప్రభుత్వ భూములకు కూడా పరిహారం కింద లెక్కగట్టారని సోము  వీర్రాజు విమర్శించారు. నాడు అవినీతి అని చెప్పిన జగన్... ఇప్పుడు ఎందుకు చంద్రబాబు లెక్కలు తేల్చడం లేదని ప్రశ్నించారు.

అంచనాల పెంపు, అక్రమాల ఆరోపణలను టీడీపీ కొట్టి పారేసింది. పోలవరం విషయంలో ఇరుకున పడ్డ వైసీపీని కాపాడేందుకే... బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రంగంలోకి దిగారని టీడీపీ ఆరోపిస్తోంది. అక్రమాలు జరగలేదని స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్ లో చెపితే....వీర్రాజు బిన్నంగా ఎలా మాట్లాడుతారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంచనాల విషయంలో గతంలో వైసీపీ చేసిన ఆరోపణల వల్లే ఇప్పుడు నష్టం జరుగుతోందని చెబుతున్నారు.

పోలవరం విషయంలో కేంద్రం పార్లమెంట్ లో చేసిన ప్రకటననే టీడీపీ అస్త్రంగా వాడుకుంటోంది. అవినీతి ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు...పోలవరంలో ఎంత పని పూర్తి అయ్యిందనే లెక్కల విషయంలోను దాన్నే పదే పదే చూపుతోంది. ఒక వేళ అంచనాల పెంపు లో అక్రమాలు జరిగితే...ఇప్పుడు కేంద్రం ఇస్తున్న రేటుకు పోలవరం కట్టాలి అంటూ కూడా టీడీపీ సవాళ్లు విసురుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: