కోవిడ్ - 19 : అపరిశుభ్రతే కరోనాకు ప్రధాన ఆయుధం...

VAMSI
కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ దేశాల ప్రజలు గజగజ వణికిపోయారు... ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ పేరిట ఇంట్లోనే బందీలుగా మారిపోయారు...... అయితే ఇప్పుడిప్పుడే సమస్య గాడిన పడుతోంది. ప్రజల రోడ్లపై తిరుగుతున్నారు. మన భారతదేశంలో నెమ్మది నెమ్మదిగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.... మరణాల రేటు కూడా తగ్గిందనే చెప్పాలి. ఈ లెక్కలన్నీటిని పరిశీలించిన శాస్త్రజ్ఞులు భారతదేశంలోని ప్రజలకు కరోనాను ఎదిరించగల  శక్తి పెరిగిందని పేర్కొన్నారు... అవును   అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న శాస్త్రజ్ఞులు  ఈ విషయాన్ని వెల్లడించారు. మిగిలిన దేశాలతో పోలిస్తే ఎంతో వేగంగా భారతదేశంలో కరోనా ఎలా నియంత్రణలోకి వచ్చింది అనే విషయంపై సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లోని భారతీయ సైంటిస్టులు అధ్యయనం చేపట్టారు.

ఈ రీసెర్చ్ లో ఒక నమ్మలేని నిజాన్ని కనుగొన్నారు శాస్త్రజ్ఞులు. అదేంటంటే  ఇండియాలో ఇప్పటికీ పరిశుభ్రత చాలా తక్కువగానే ఉందనే చెప్పాలి. విదేశాలతో పోల్చుకుంటే భారతీయులకు నిర్లక్ష్యం ఎక్కువ... అనడం కంటే వారిని కఠినంగా సూచించే నియమాలు తక్కువనే చెప్పాలి. అందుకనే ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారబోయడం ఇక్కడ కామన్. ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ అపరిశుభ్రత  కారణంగానే కరోనాని కంట్రోల్ చేశామని.... అపరిశుభ్రత వల్లే భారత్ లో కరోనా తగ్గిందని.. ప్రజల్లో ఇమ్యూనిటీ పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో తరచూ పరిశుభ్రత కోసం శానిటైజేషన్ ప్రతి రోజు నిర్వహించడం సాధ్యం కాదు. అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో కాలుష్యమైన గాలినే పీలుస్తున్నారు. గాలి కాలుష్యం కారణంగా కొందరు రోగాల బారిన పడుతున్నారు .... మరికొందరు ప్రతి ఏడాదిలో సగటున 1.2 మిలియన్ల మంది భారతీయులు మృత్యువాత పడుతున్నారు.

కానీ ఇక్కడ తెలిసిన విషయం ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనా కేసులు అలాగే కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పారిశుధ్యం బాగుండి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్లు తగ్గినప్పటికీ అక్కడి ప్రజల్లో ఆటో ఇమ్యూనో డిజార్డర్లు అలెర్జీలు వంటి సమస్యలు అధికంగా పెరిగాయని అధ్యయనంలో గుర్తించారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉన్నది. ఇందుకు కారణం ఇక్కడ పరిశుభ్రత లేకపోవడం... ఎక్కువగా మురికివాడలలో అపరిశుభ్రత మధ్య నివసించే జనాల్లో.... ఆ అపరిశుభ్రతను తట్టుకోగల ఇమ్యూనిటీ పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారిశుద్ధ్యం తక్కువగా ఉండటం వల్ల ప్రజల్లో కరోనా తట్టుకొనే ఇమ్యునిటీ వచ్చేసిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ  అపరిశుభ్రత కారణంగానే భారత దేశ ప్రజలలో ఇమ్యూనిటీ పవర్ అనే ఆయుధం పెరిగి కరోనా నుండి కాపాడడంలో పని చేస్తోందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: