పొగ తాగారో పగ పట్టేస్తాడు ? ఈ కిమ్ ఏంట్రా బాబు ఇలా తయారయ్యాడు ?

ఎప్పుడూ ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. నియంతృత్వ పరిపాలనకు మారుపేరుగా నిలుస్తూ, చిత్రవిచిత్రమైన చట్టాలను చేస్తూ, ఎప్పుడూ ప్రజలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంటారు కిమ్. ఆయన నియంత్రిత పరిపాలన పై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా, సొంత దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, అసంతృప్తి ఆగ్రహంతో ఉన్నా ఏ మాత్రం తన వ్యవహారశైలిని మార్చుకునేందుకు కిమ్ ఇష్ట పడరు. ఇక ఉత్తర కొరియా లో ఇప్పుడు ఏదో ఒక సంచలన చట్టం రూపొందిస్తునే ప్రజలకు నరకం చూపిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని నిర్ణయాలు మాత్రం ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చేసినా,  అవి కూడా వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి.



 కిమ్ కు వింత వింత అలవాట్లు ఎన్నో ఉన్నాయి. అలాగే ఆయన చైల్డ్ స్మోకర్ గా ఉండడంతో ఎప్పుడూ, సిగరెట్ కాల్చుతూనే ఉంటారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన దురలవాట్లకు దూరమైనట్లు ప్రచారం జరిగింది. అయితే తాను సిగరెట్లు కాల్చడం మానే శాను కాబట్టి , తమ దేశ ప్రజలు కూడా వాటికి దూరంగా ఉండాలనే ఆలోచనతో పాటు, దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగడం నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఉత్తర కొరియా ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కొత్త చట్టం ప్రకారం స్కూళ్లు, థియేటర్లు, మాల్స్ మిగతా బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ, పొగ త్రాగడం, చట్టాన్ని ఉల్లంఘించినట్లే అనే విధంగా కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో స్మోకర్ లు కంగారుపడిపోతున్నారు.



 ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిబంధనలు విధించినా, వీటిని ఉల్లంఘిస్తే బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేసే వారికి ఏ శిక్ష విధిస్తారు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వ లేదు. అయితే శిక్ష పడుతుందనే సంకేతాలు ఇవ్వడంతో పొగ రాయుళ్లు అంతా వణికి పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: