ప్రమాదంలో తెలంగాణ యువత భవిష్యత్తు....

VAMSI
తెలంగాణ మరియు చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి వ్యవహారం శృతి మించుతోంది అని ఎన్ సి బి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గత కొద్దికాలంగా జరుగుతున్న పరిణామాలు  కారణంగానే ఈ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ మరియు ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలైన ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు, వరంగల్, శ్రీకాకుళం ఏజెన్సీలోని గంజాయి సాగు విస్తీర్ణం పెరిగినట్లు ఎక్సైజ్, డి ఆర్ ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) ఎన్ సి బి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్ వలన లాక్ డౌన్ కారణంగా .... గతంలో లాగా పెద్ద నిఘా లేకపోవడంతో.. గంజాయి స్మగ్లర్లు దొరికిన అవకాశాన్ని అదునుగా చేసుకొని రెచ్చిపోతున్నారు. పోలీసులు నిఘా అంతగా లేకపోవడంతో.... ఇదే మంచి అనుకూల సమయంగా గంజాయి భారీగా సాగు చేశారని తెలుస్తోంది.

అయితే సాగుచేసిన గంజాయి మహారాష్ట్ర గుజరాత్ ఎగుమతి చేసే క్రమంలో కట్టుదిట్టమైన నిఘా ఉన్న హైదరాబాదులో దొరికిపోతున్నారు అక్రమ వ్యాపారులు. పట్టుబడిన ప్రతిసారీ వేల కేజీల కొద్ది గంజాయి దొరుకుతుండంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.... వీటిలో ప్రధానంగా లాక్ డౌన్ సమయంలో గంజాయి సాగు జోరుగా సాగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ పరిసరాలకు మాత్రమే పరిమితమైన గంజాయి సరఫరా ఇప్పుడు మెల్ల మెల్లగా కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లా, ఖమ్మం మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు కూడా గంజాయి మత్తు పాకుతోందని... పేర్కొన్నారు. ఇక గంజాయి మత్తులో యువత జీవితాలు చిత్తవుతున్నాయి... ప్రముఖంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని ఎన్ టి పి సి తదితర ప్రాంతాలలో గంజాయి సరఫరా వేగంగా విస్తరించింది. దాంతో అక్కడి యువత గంజాయి కి బానిసలుగా మారి ఆ మత్తులోనే అనవసరమైన గొడవలకు దిగడం మరియు ఇతరులపై దాడులు చేయడం చేస్తూ.... పక్కదోవ పడుతున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు ఓవైపు గంజాయి అక్రమ రవాణా వ్యవహారానికి ఆనకట్ట వేస్తూనే మరోవైపు గంజాయి సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారిపై పి డి కేసులు నమోదు చేస్తున్నారు.... ఇంకోవైపు తెలంగాణలో పెరుగుతున్న గంజాయి సరఫరా ను పూర్తిగా నివారించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.

గతంతో పోలిస్తే ఈసారి రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తారంగా గంజాయి సాగు  పెద్ద మొత్తంలో చేసినట్లు ఎన్‌సీబీ, డీఆర్‌ఐ, ఎక్సైజ్‌శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఆగస్టులో హయత్‌నగర్‌ వద్ద 995 కేజీల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు  పట్టుకొని స్వాధీనం చేసుకున్న విషయం  తెలిసిందే. అదే నెలలో డీఆర్‌ఐ అధికారులు పంతంగి టోల్‌ గేట్‌ వద్ద దాదాపు రూ.3.6 కోట్ల విలువైన 1,500 కిలోల గంజాయిని పట్టుకున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత వివిధ ప్రాంతాల్లో దాదాపు 4వేల కిలోల గంజాయిని ఒక్క ఎన్‌సీబీ అధికారులే పట్టుకోవడం చూస్తుంటే గంజాయి అక్రమ రవాణా ఎంత వేగంగా సాగుతోంది అలాగే ఎంత భారీగా సాగుతోంది’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే దేశానికి అతి ముఖ్యమైన యువత భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదముందని ప్రభుత్వం ఆలోచనలో పడింది. తెలంగాణాలో ఈ విధంగా జరగడం రాష్ట్రానికి చాలా ప్రమాదమని రాజకీయ ప్రముఖులు మరియు ప్రభుత్వ అధికారులు బాధపడుతున్నారు. మరి దీనిని ఏవిధంగా అరికడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: