వీటిని రాత్రి పూట తింటే ఏమవుతుందో తెలుసా..?

Suma Kallamadi
మనం కొన్ని ఆహార పదార్ధాలని రాత్రి తీసుకోవడం మంచిది కాదు. వీటి వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వేటిని తినకూడదు...? తింటే ఏమవుతుంది...? ఇప్పుడే తెలుసుకోండి. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. రాత్రి పూట  తినకూడని పదార్థాలు చాలా ఉన్నాయి. పొద్దున పూట ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు, రాత్రిపూట తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటాయి గుర్తుంచుకోండి. అందుకే ఈ ఆహార పదార్ధాలని  రాత్రిపూట తినకుండా  చూసుకోవాల్సిన బాధ్యత మీదే.

ఎప్పుడు కూడా మాంసం రాత్రిపూట తీసుకోకండి. ఎందుకంటే....? మాంసం జీర్ణం కావడానికి తీసుకునే సమయం చాలా ఎక్కువ. అందుకని  రాత్రిపూట మాంసం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మీద భారం పడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు వస్తాయి. అంతే కాదు నిద్ర పాడవుతుంది. కనుక ఎట్టి పరిస్థితి లో తీసుకోవద్దు. అలానే ఐస్ క్రీమ్ ని కూడా రాత్రిళ్ళు తినకండి. ఎందుకంటే...? ఐస్ క్రీమ్ లో అధిక చక్కెర శాతం ఉండడం వల్ల నిద్రని దూరం చేస్తుంది. అధిక చక్కెర, జీర్ణం అవడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. దానివల్ల నిద్ర పాడవుతుంది. కాబట్టి ఐస్ క్రీమ్ కి రాత్రిపూట నో చెప్పండి. అదే రాత్రి కనుక  ఆల్కహాల్ తీసుకుంటే...? మరుసటి రోజు తీవ్ర అలసత్వంతో బాధపడాల్సి ఉంటుంది.

అంతే కాదు క్యాబేజీ, క్యాలిఫ్లవర్ కూడా తీసుకోకండి. ఎందుకంటే...?  వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణం అవడానికి టైమ్ తీసుకుంటుంది. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల నిద్ర దూరం అవుతుంది. అలానే రాత్రిళ్ళు కాఫీ టీ కి దూరంగా ఉండండి. కాఫీ లో ఉండే కెఫైన్ బ్లడ్ ప్రజర్ ని ఎక్కువ చేసి ఉత్తేజాన్ని ఇస్తుంది. దీని కారణంగా నిద్ర తొందరగా రాదు. అది మీ తర్వాతి రోజుపై ప్రభావం చూపుతుంది. టమాటా కూడా తీసుకోవద్దు. అధిక శాతం విటమిన్ సి, జీర్ణం కావడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది.







 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: