కరోనా వైరస్ ను వ్యాక్సిన్ అడ్డుకోలేదా...?
ఓవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనావైరస్ సెకండ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో ప్రకటిస్తే.... దీంతోపాటు రూపాన్ని మార్చుకొని వచ్చే ఈ కరోనా వైరస్ పై ఇంకెంత ప్రళయం తీసుకొస్తుంది అంటూ... ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ తన జన్యుక్రమాన్ని మార్చకోబోతున్నదని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. ఒకసారి కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంది అంటే ప్రపంచమంతా తారుమారయ్యే అవకాశం లేకపోలేదు...వైరస్ లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్రమత్తమైన డెన్మార్క్ ప్రభుత్వం ఆ దేశంలో ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో వందల కొద్దీ ఫారమ్‌లలో మింక్ ల పెంపకం చేపట్టారు. ఉత్తర డెన్మార్క్‌లో కోవిడ్-19 ఆంక్షలు నవంబరు 7 నుంచి అమల్లోకి వస్తాయని ప్రధాని మెట్టీ ఫ్రెడ్రెక్సన్ ప్రకటించారు.
జన్యుమార్పిడి ద్వారా మింక్ నుంచి వ్యాపించే వైరస్ వలన ప్రపంచం లో ప్రళయం సంభవిస్తుందని అన్నారు. అయితే ఉత్తరడెన్మార్క్లోని 207 మింక్ ఫారమ్స్‌లో కొత్త రకం కరోనా వైరస్ ను గుర్తించారు. మొదట్లో దీనిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ ప్రాంతంలోని దాదాపు 1100 ఫారమ్స్‌లో సుమారు 1.7కోట్ల మింక్‌లకు వైరస్ ముప్పు ఏర్పడింది. తాజాగా ఐదు మింక్ కేంద్రాల్లోని 12 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు 214 మందికి పైగా వైరస్ సోకినట్లు ది స్టేటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ నివేదికలో తెలిపింది. అయితే ఇటువంటి వైరస్ ఎదుర్కోవడం పెద్ద సమస్యగా పరిగణించి వచ్చని హెచ్చరించింది.