దిండు కింద ఫోన్ పెడుతున్నారా.. ప్రాణాలు పోతాయి సుమీ..!
మొబైల్ అతిగా వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని అటు వైద్యనిపుణులు ఎన్నిసార్లు చేస్తున్నప్పటికీ ఎక్కడ మొబైల్ వినియోగదారులు మాత్రం మార్పు రావడం లేదు. రోజురోజుకు మొబైల్ వాడకం పెరుగుతుంది తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కొంతమంది అయితే నిద్ర పోయేటప్పుడు కూడా మొబైల్ తమ దగ్గరే ఉండేట్లుగా చూసుకుంటూ ఉంటారు. ఏకంగా కొంతమంది తమ దిండు కింద మొబైల్ పెట్టుకుని పడుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇలా మొబైల్ దిండు కింద పెట్టుకుని పడుకోవడం అందరికీ ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఈ అలవాటు కొన్ని కొన్ని సార్లు ప్రాణాలమీదికి తెస్తూ ఉంటుంది.
చాలామంది పడుకునే సమయంలో మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి నిద్ర పోతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించినప్పటికీ కూడా వారిలో మాత్రం ఇప్పటికీ మార్పు రాదు. కొన్ని కొన్ని సార్లు మొబైల్ పేలే ప్రమాదం కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే కేరళలోని తిరువనంతపురంలో ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తి దిండు కింద ఫోన్ పెట్టుకొని పడుకో గా అది ఒక్కసారిగా పేలింది. దీంతో భుజానికి ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. చార్జింగ్ పెట్టలేదని అయినా ఫోన్ పేలింది అంటూ సదరు బాధితుడు చెప్పుకొచ్చాడు.