ప్రమాణ స్వీకారం చేయనే లేదు.. జో బైడెన్ అప్పుడే మొదలెట్టేసాడుగా..?
అంతేకాదు జో బైడెన్ గెలవగానే అమెరికాలో ప్రజలందరూ రోడ్ల పైకి చేరి భారీగా సంబరాలు చేసుకున్నారు. ఇక జో బైడెన్ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ ఇంకా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు ప్రమాణస్వీకారం చేయకముందే తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కార్యాచరణ మొదలుపెట్టాడు. ఇప్పటికే తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదట చేసేది వలసదారులు అందరికీ అమెరికా పౌరసత్వం కల్పించడమే అంటూ ఇటీవల జో బైడెన్ ప్రచార బృందం కూడా స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు కరోనా వైరస్ నియంత్రణకు కూడా చర్యలు చేపడతాం అని హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు జో బైడెన్.
అయితే అమెరికా అధ్యక్షుడిగా గెలిచినట్లు అధికారిక ప్రకటన రాకముందే రంగంలోకి దిగి కార్యాచరణ మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నారు జో బైడెన్. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చిన మేరకు... 19 మంది డాక్టర్లు సైంటిస్టుల తో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇక అమెరికాలో కరోనా ను ఎలా కంట్రోల్ చేయాలి.. వ్యాక్సిన్ అందరికీ అందే విధంగా ఎలా చర్యలు చేపట్టాలి అన్నది ఈ బృందం సూచించినట్లు తెలుస్తోంది.