అక్రమ సంబంధాలకు కారణం ఇదేనట.. ఛీ ఛీ..
కాపురాలు కుల్చుతున్న ఇలాంటి సంబంధాలకు కారణం ఏమిటనే ఓ ప్రయోగం చేపట్టగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. తక్కువ ఆకర్షణీయంగా ఉండే మహిళలు వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. మగాళ్లు తమ పార్టనర్ అందంగా లేకపోయినా, భాగస్వామితో రొమాన్స్ తుక్కువ కావడం, ఆకర్షణ తగ్గడం వల్ల మరొకరితో సంబంధాల దిశగా ఆలోచనలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు..ఇందులో మరో ముఖ్య విషయమేంటంటే.. ఈ సంబంధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాము , దాని వల్ల ఎన్ని రకాల నష్టాలు వస్తున్నాయి ఇవన్నీ తెలియకుండానే చేస్తున్నారని ఏదో మోజులో చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు..
ఈ సంబంధాలకు ముఖ్య కారణాల విషయానికొస్తే..ఎక్కువ మంది ఆకర్షనీయంగా ఉన్న వ్యక్తుల ఫొటోలను చూడగానే ధ్వాస మళ్లినట్లు గుర్తించారు. వారిలో రొమాంటిగ్గా కనిపించే వ్యక్తులను చూసినప్పుడు.. ఆకర్షణకు లోనవుతున్నారు. అలా వేరొకరితో సంబంధాన్ని పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వివాహేతర సంబంధాలకు ఎక్కువగా పురుషులే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. పెళ్లికి ముందే సంబంధం ఉన్న వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారట. మహిళలు అయితే ఈ విషయం లో వేరేగా ఉన్నారని నిపుణులు తెలిపారు..ఈ సంబంధాలు కొనసాగడానికి చిన్న వయసులో కలిగిన చేదు అనుభవాలు కూడా కారణమని చెబుతున్నారు.కొత్తగా పెళ్లయిన 233 జంటలపై స్టడీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి చాలా ఆకర్షణీయంగా కనిపించే స్త్రీ, పురుషుల ఫొటోలను చూపించారు.. ఆ పరీక్షలో ఈ విషయాలు బయటకు వచ్చాయట...చూసారుగా చిన్న ఆకర్షణ వల్ల ఎంతగా నష్టం వాటిల్లుతుందో.. జాగ్రత్త సుమీ..