బొత్స రాజకీయానికి బలవుతున్న మరో వైసీపీ నేత..?

P.Nishanth Kumar
రాజకీయాల్లో సరైన బ్యాక్ బోన్ లేకపోతే ఎదగడం చాలా కష్టం.. పార్టీ కోసం ఎంత కష్టపడినా బ్యాక్ అప్ లేకపోతే ఆ నాయకుడు పెద్ద నాయకుడు అయ్యే ఛాన్స్ ఏమాత్రం ఉండదు.. లీడర్ గా ఎదగాలంటే అప్పటికే పెద్ద పెద్ద లీడర్లుగా ఉన్నవారితో అనుబంధం పెంచుకోవాలి.. వారితో కలుగొలుపుగా ఉండాలి.. అయితే ఇవన్నీ చేస్తున్నా కూడా విజ‌య‌న‌గ‌రం  నియోజకవర్గంలో ఓ నేత కు వ్యతిరేక పనులు జరుగుతున్నాయి.. విజయనగరంలో పెన్మత్స సాంబ‌శివ‌రాజు కుటుంబం ఆదినుంచి వైసీపీ కి వెన్నుదన్నుగా ఉంటుంది. ఇక్కడ వైసీపీ జెండాను మోసిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈకుటుంబం లోనుంచి వ్యక్తి అయిన  సాంబ‌శివ‌రాజు అని చెప్పాలి..

అయితే ఇటీవలే కాలంలో జగన్ ఈ కుటుంబంలోని వ్యక్తి కి కాకుండా వేరే నేతకు టికెట్ ఇవ్వడం కొంత చర్చకు దారి తీసింది.  బొత్స బంధువు అయిన బ‌డ్డుకొండ అప్పల‌నాయుడ‌కు సీటు ఇవ్వగా జ‌గ‌న్ పెనుమ‌త్స కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేక పోయారు. దాంతో ఈ సీటు ను వారికి కాకుండా చేయడానికి బొత్స చాలా ప్రయత్నాలు చేశాడని తెలుస్తుంది. సాంబశివరావు రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న కుమారుడు సురేష్‌బాబు 2014 ఎన్నిక‌ల్లో నెల్లిమ‌ర్లలో పోటీ చేసి ఓడిపోయారు. దాంతో 2019 లో జగన్ ఆయనపై నమ్మకం కోల్పోయారు. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసినందుకు గాను జ‌గ‌న్ పెనుమ‌త్స సాంబ‌శివ‌రాజుకు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఆయ‌న మ‌ర‌ణాంత‌రం రెండు సంవ‌త్సరాల ప‌ద‌వీ కాలం ఉన్న ఎమ్మెల్సీ సీటును సూర్యనారాయ‌ణ‌రాజు ఉర‌ఫ్ సురేష్‌బాబుకు క‌ట్టబెట్టారు. ఈ రెండు సంవ‌త్సరాల ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీలో చాలా పోటీ ఉన్నా చివ‌ర‌కు పెనుమ‌త్స వార‌సుడికి ద‌క్కింది.

అయితే ఈ ప్రాంతంలో ఏ పనులు జరిగినా ఈయనకు చెప్పకుండా చేస్తున్నారట వైసీపీ నేతలు..కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా వ్యవహరిస్తున్నారట. రాజ‌కీయంగా పెన్మత్స సురేష్‌బాబు మంచి గుర్తింపు ఉంది. వివాద ర‌హిత కుటుంబం.. ప్రజ‌ల‌కు సానుకూలంగా ఉండే ఫ్యామిలీ గా గుర్తింపు సాధించారు. ఈ కుటుంబానికి ప్రధాన్యం ఇస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈయ‌న రాజ‌కీయంగా దూకుడు పెంచి.. త‌మ‌కే పోటీ ఇవ్వడం ఖాయ‌మ‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌, ఆయ‌న మేన‌ల్లుడు.. నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పల‌నాయుడు వ‌ర్గం భావిస్తోంద‌ట‌. అందుకే బొత్స తనదైన రాజకీయం తో వారి ని సేడ్ చేసేందుకు చూస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: