అమరావతి జిల్లా పై జగన్ స్ట్రాటజి ఏంటి ?

వైసీపీ ప్రభుత్వం ఏదో ఒక సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. మూడు రాజధానులు కావచ్చు, మరేదైనా కావచ్చు  ప్రభుత్వం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి ఉంటున్నాయి. తాజాగా మరోమారు ఇదే రకమైన సంచలన నిర్ణయం వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. ఏప్రిల్ లో 32 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమూ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఒక జిల్లాగా చేయడంతో పాటు, మరి కొన్ని కీలకమైన ప్రాంతాల్లో జిల్లాలను ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రజా సంకల్పయాత్ర చేపట్టేందుకు జగన్ హామీ ఇవ్వడంతో, ఆ హామీలను నెరవేర్చుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. 




అలాగే రోజు రోజుకు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుండడంతో , దీని నుంచి బయట పడేందుకు జిల్లాల పెంపు ప్రతిపాదన తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తున్నారు.అయితే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాలు ఏర్పాటు చేస్తాం అంటూ ప్రజసంకల్ప యాత్రలో ప్రకటించిన జగన్ ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో  ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రజల్లో మరిన్ని డిమాండ్లు వస్తుండడం,  కొత్త జిల్లాల ఏర్పాటు పై వత్తిడి పెరిగి పోతుండటంతో కొత్త జిల్లాల ఏర్పాటుకి అంగీకరిస్తూ, జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల్లో కర్నూలు జిల్లాలోని ఆదోని పార్లమెంట్ నియోజకవర్గం కాకపోయినా, అక్కడ జిల్లాను ఏర్పాటు చేయబోతున్నరట. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం ఆరు జిల్లాలను అదనంగా ఏర్పాటు చేయబోతున్నారు. 



వైసీపీ మూడు రాజధాననుల ప్రతిపాదన తీసుకురావడంతో పాటు అమరావతి ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అమరావతి జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే అమరావతిని గ్రేటర్ నగరంగా మార్చేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమరావతిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయబోతున్న కృష్ణా జిల్లాలోని ఓ రెండు నియోజకవర్గాలను ఈ జిల్లాలో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెదకూరపాడు , తాడికొండ ,మంగళగిరి, జగ్గయ్యపేట , నందిగామ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమరావతి జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలో ఏర్పాటు ద్వారా ప్రభుత్వం పై వ్యతిరేకత లేకుండా చేస్తున్న జగన్ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: