దుబ్బాక: టీఆర్ఎస్ ఓడిపోయిందని అభిమాని ఆత్మహత్య..!

N.ANJI
దుబ్బాక ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ఓటమిని ఓడిపోవడాన్ని తట్టుకోలేని ఒక అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక విజయం ముంగిట టీఆర్ఎస్ బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ దుబ్బాకలో అపజయం పాలైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వేయి ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటికే పార్టీలో ఎక్కడ చూసిన కాస్త నైరాశ్యం కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఓటమి పాలవడాన్ని తట్టుకోలేని ఆ అభిమాని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని కొనాయిపల్లికి చెందిన స్వామి (34) మొదటి నుండి టీఆర్ఎస్ అభిమాని. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డిని, మంత్రి హరీశ్ రావు, సీఎం కేసీఆర్ కు ఆయన వీరాభిమాని. వారినెవరైనా ఏమైనా అంటే అవతలివారికి సరైన బదులిచ్చేవాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడేవాడు. టీఆర్ఎస్ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా.. తాను శక్తి వంచన లేకుండా పనిచేసేవాడు.

కానీ దుబ్బాక లో ఫలితం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో స్వామి తట్టుకోలేకపోయాడు. అలాంటిది తాను ఎంతగానో అభిమానించే పార్టీ దుబ్బాకలో ఓడిపోవడంతో స్వామి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం అర్థరాత్రి గ్రామంలో ఉన్న వేపచెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. స్వామికి పెళ్లి కూడా అయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్వామికి పెళ్లి కూడా అయినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: