ఈ మరాఠి వంటలమ్మ మీకు తెలుసా...?
ఒక రోజు మాత్రం పావ్‌బాజీ చేయమని అవ్వను బతిమాలాడు. తప్పుతుందా? వండి పెట్టింది. ఆ అవ్వ ఎంతో రుచిగా చేయడంతో ఆ మనవడికి ఒక ఐడియా వచ్చింది. ఇంకేం ఉంది ఆ ఆలోచనే అంత మార్చేసింది. మొత్తానికి ఆ మనవడు అవ్వతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి దానిలో దేశీ వంటలు చేయించాలనుకున్నాడు. ఇలా వీళ్ళు మార్చి 2019లో ' ఆప్లీ ఆజీ ' (Aapli Aaji) పేరుతో యూట్యూబ్ వంటల చానెల్‌ను ప్రారంభించారు . మరి సక్సెస్ అయ్యిందా అనే సందేహం పడొద్దు.
మొత్తం వ్యూస్ 6 కోట్లు. యూట్యూబ్ నుంచి బహుమతి కూడా అందుకుంది సుమన్ ధమని. దేశీయ వంటల తో అవ్వే ఇప్పుడు పాపులర్. ఈ అవ్వ ఛానెల్ కి ఆరు నెలల్లోనే 5 వేల సబ్‌స్ర్కైబర్లను పొందగలిగాడు. అలానే ఇప్పటి వరకు ఈ ఛానెల్ లో 150 వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది.ఈ అవ్వ మామూలు అవ్వ కాదు. మనవడి సాయంతో కొన్ని ఇంగ్లిష్ పదాలు కూడా నేర్చుకుంది. తన వీడియోస్ తో మహారాష్ట్ర లో పాపులర్ యూట్యూబ్ వంటలమ్మగా పేరు తెచ్చుకుంటున్నది ఈ అవ్వ.