దారుణం : సొంత మనుమరాలి పైన కన్నేసిన తాత.. చివరికి..?
దీంతో అటు బయట వారి నుంచి ఇంట్లో వారి నుంచి కూడా కనీస రక్షణ కరువై ఆడపిల్లల జీవితం రోజురోజుకూ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఆలనా పాలనా చూసుకోవాల్సిన సొంత వారే చివరికి కామంతో కళ్లు మూసుకుపోయిన అత్యాచారాలకు పాల్పడుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది ఆడపిల్లల జీవితం. ఇటీవలే ఇలాంటి ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలనా పాలనా చూసుకుంటూ కంటికి రెప్పలా మనవరాలిని కాపాడుకోవాల్సిన తాత కామం తో ఊగిపోయాడు. కామ పిశాచి లా మారిపోయిన తాతా సొంత మనవరాలి పైన అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది.. కామంతో ఊగిపోయినా ఓ వృద్ధుడు సొంత మనవరాలి పైన అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. బుధవారం సాయంత్రం సమయంలో ఇంట్లో తన కొడుకు కోడలు భార్య లేని సమయంలో తొమ్మిదేళ్ల మనవరాలి పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక ఇంటికి రాగానే బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.