చలితో జాగ్రత్త సుమీ...అధికారులు హెచ్చరిక జారీ....
చలిగాలులతో పాటు పొగమంచు కురుస్తుండటంతో ప్రజలకు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడింది. దీంతో ప్రజలు ఉదయం పెద్దగా బయటకు కూడా రావడం లేదు.
ఇప్పటికే ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వలన చెరువులు నిండుకుండలా కనిపిస్తుండగా.... ఇప్పుడు దానికి తోడు ఉత్తర ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇక రాత్రి పూట ఉష్ణోగ్రతలు అతి దారుణంగా పడిపోతున్నాయి దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో.. తూర్పు నుంచి కూడా తేమ గాలులు స్టార్ట్ అవ్వ బోతున్నాయి అన్న వార్త మరింత కలవరపెడుతోంది.
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ చలి తీవ్రత ఇదేవిధంగా కొండెక్కుతుంది.ముఖ్యంగా విశాఖ జిల్లా చలి తీవ్రత కి గడగడలాడుతోంది. పగలు కాస్త ఫర్వాలేదు అనుకున్నా... రాత్రయ్యే సరికి ప్రజలు తీవ్రమైన చలితో గజ గజ వణికి పోతున్నారు. రానున్న రోజుల్లో వణికించే చలి తీవ్రత మరికాస్త పెరగనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు కూడా వాతావరణ మార్పులను గమనించుకుంటూ ఉండాలని, అదేవిధంగా కరోనా కూడా చలికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.