హెర్బల్ ఆయిల్ కొంటే.. 52 లక్షలు మాయం.. చివరికి..?

praveen
ఈ మధ్యకాలం లో ప్రజల ను బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకోవాలని అనుకునే కేటుగాళ్లు రోజురోజుకు ఎక్కువ వుతున్నారు  అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా సైబర్ నేరాలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి  తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. రోజు రోజుకు సైబర్ నేరగాళ్ల పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటి కి కూడా సైబర్ నేరాలు మాత్రం ఎక్కడా తగ్గు ముఖం పట్టడం లేదు. ఏదో ఒక విధం గా జనాలని ఆకర్షించడం ఇక ఆ తర్వాత భారీగా డబ్బులు దండుకుని బురిడీ కొట్టించడం లాంటివి చేస్తున్నారు కేటు గాళ్లు.

 ముఖ్యం గా భారీగా డబ్బులు ఉన్నా ఖాతాల నే టార్గెట్గా చేసుకుంటున్న కేటుగాళ్లు ఏదో ఒక విషయం లో ఆకర్షించి చివరికి బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. హెర్బల్ ఆయిల్ పేరుతో జనాల ను ఆకర్షించారు కేటుగాళ్లు. కానీ చివరికి భారీగా డబ్బులు దండుకుని బురిడీ కొట్టించాడు. ఈ ఘటన స్థానికం గా చర్చనీయాంశం గా మారింది హైదరాబాద్ నగరం లో వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన. ఏకంగా  52 లక్షల కాజేసి  కుచ్చు  పెట్టారు సైబర్ నేరగాళ్లు.

 హెర్బల్ ఆయిల్ పేరుతో హైదరాబాద్ నగరం లోని ఎస్సార్ నగర్ వ్యాపారికి.. సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపించారు.  సరుకు అమ్ముతాము  అంటూ ఆన్లైన్లో పరిచయమై ఆ తర్వాత ఖాతా ఖాళీ చేశారు.  ఏకంగా సరుకు  కోసం యాభై రెండు లక్షల రూపాయలు బదిలీ చేశాడు వ్యాపారి ఆ తర్వాత మాత్రం కేటుగాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తో అనుమానం వచ్చి పోలీసుల ను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితుల విషయం లో అప్రమత్తం గా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: