మోడీకి మూడిందా.. జగన్ తొలిసారి తిరుగుబాటు..?
ఇది గమినించిన జగన్ మోడీ పై తిరుగుబాటు చేయడానికి నిర్ణయించుకున్నారు.. వ్యవసాయ బిల్లు లో సపోర్ట్ చేసిన, ఎన్డీయే లో చేరడానికి సై అన్నా కూడా మోడీ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర హక్కులను కాపాడే విషయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. తాము కేంద్రంతో గొడవలు పెట్టుకోకుండా ఏపీ అభివృద్ధి కోసం పనిచేయాలని చూస్తూంటే ఢిల్లీ పాలకులు మాత్రం తెగే దాకా లాగుతున్నారన్న బాధ ఆయనలో రోజు రోజు కి ఎక్కువైపోయింది. ప్రత్యేక హోదాను మడిచేసినా, విభజన హామీల విషయంలో వెనకంజ వేసినా సహించాం, కానీ తన తండ్రి వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అయిన పోలవరానికే టెండర్ పెట్టేస్తూంటే జగన్ ఇక ఊరుకునే సమస్య లేదని తన నేతలకు చెపుతున్నారట.
పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దాన్ని కేంద్రమే పూర్తి చేయాలని కూడా జగన్ భావిస్తున్నారుట. అవసరం అయితే ఆ ప్రాజెక్ట్ ని కేంద్రానికే అప్పగించైనా పూర్తి చేసేలా చూడాలనుకుంటున్నారుట. దీనిమీదనే తాజాగా ఆయన మోడీకి లేఖ రాశారు. కానీ స్పందన ఇంకా తెలియలేదు ఒకవేళ ప్రతికూలంగా కేంద్రం వ్యవహరిస్తే మాత్రం అతి పెద్ద పొలిటికల్ సినిమానే జగన్ చూపించడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.తెలుగు రాష్ట్రాలో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఎక్కడా మంచినీళ్ళు పుట్టకుండా జగన్ తన సత్తా చూపిస్తారని అంటున్నారు. పోలవరం సమస్య మీద జగన్ ఎంపీలు రాజీనామాలు చేస్తే తిరిగి వారు గెలవడం ఖాయం. ఆ విధంగా ప్రజా బలం చూపించి అయినా మోడీని లొంగదీయాలని జగన్ భారీ పధకమే వేశారని అంటున్నారు. చూడాలి మరి.