మరో స్కెచ్‌తో ముందుకొస్తున్న బీజేపీ...జగన్‌కు దెబ్బ పడుతుందా?

M N Amaleswara rao
జగన్‌కు ప్రజాధరణ మరింత పెరుగుతుందనో లేక ఆయన్ని ఇప్పుడు దెబ్బ కొట్టకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో తమకు దెబ్బ పడిపోతుందేమో అని భయమో గానీ...ఏపీలో ప్రతిపక్షాలు మాత్రం జగన్‌ని ఎప్పటికప్పుడు నెగిటివ్ చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం నేతలు...జగన్ ప్రభుత్వంపై ప్రతిరోజూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ విషయాన్ని వదలకుండా జగన్‌పై విరుచుకుపడుతూనే ఉన్నారు. అయితే టీడీపీ ఎంత ప్రయత్నించినా జనంలో జగన్ ఆధరణ మాత్రం తగ్గడం లేదు.

ఇక టీడీపీ అలా రాజకీయం చేస్తుంటే, బీజేపీ మరోలా రాజకీయం చేస్తుంది. కేంద్రంలో జగన్‌కు సహకరించినట్లే ఉంటూ, రాష్ట్రంలో మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఓ వైపు టీడీపీ స్థానాన్ని తీసుకుందామనే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు జగన్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే అవకాశం బట్టి జగన్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్‌ని ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే మత రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

మొన్న ఆ మధ్య ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడులని జగన్ ప్రభుత్వానికి అంటకట్టే ప్రయత్నం చేశారు. అలాగే జగన్ అన్యమతస్తుడు అని చెప్పి టీటీడీ డిక్లరేషన్‌పై పెద్ద ఎత్తున రచ్చ చేశారు. జగన్‌ని మామూలుగా ప్రజల్లో నెగిటివ్ చేయడం కష్టమని భావించి మత రాజకీయాలని తెరపైకి తీసుకొచ్చి కొన్నిరోజులు హడావిడి చేశారు. అయితే ఆ రాజకీయాన్ని ప్రజలు నమ్మకపోయేసరికి కొన్నిరోజుల నుంచి బీజేపీ నేతలు సైలెంట్‌గానే ఉంటున్నారు.

ఇక తాజాగా మాత్రం బీజేపీ మరో కొత్త స్కెచ్‌తో ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీటీడీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తిరుమల శ్రీవారి సంపదపై జగన్ ప్రభుత్వం కన్ను పడిందని, భక్తులు సమర్పించే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ వస్తే టీటీడీలో బోర్డులో ధర్మచార్యులు సభ్యులుగా ఉంటారని మాట్లాడారు. అంటే ప్రభుత్వం శ్రీవారి సంపదని వాడుకుంటుందని చెబుతున్నారు. ఈ విధంగా హిందువులని మరోసారి రెచ్చగొట్టి జగన్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: