తెలంగాణ రాజకీయాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది . అసలు ప్రధాన పోటీ అంతా, కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య అన్నట్టుగా మొన్నటి వరకు సాగింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తూ అధికారాన్ని దక్కించుకునే క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ వచ్చారు. ఈ క్రమం లోనే తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ను బలహీనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి , పెద్ద ఎత్తున ఆ పార్టీలో నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా కాంగ్రెస్ మరింతగా తెలంగాణలో బలహీనపడింది. దీంతో ఇక తమకు ప్రతిపక్షమే లేదు అని, తమకు తిరుగులేదని టిఆర్ఎస్ భావిస్తుండగా ఆకస్మాత్తుగా ఈ రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకుని బీజేపీ బలం పుంజుకుంది .
అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది.
2019 ఎన్నికల్లో
బిజెపి కొన్ని పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడంతో, ఆ పార్టీలో కాస్త ఊపు వచ్చింది. అప్పటి నుంచి ఎక్కడా నిరుత్సాహానికి గురవ్వకుండా,
బిజెపి తెలంగాణ నాయకులంతా సమిష్టిగా పని చేస్తూ, నిత్యం ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తూ, ప్రజల్లో బలమైన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ టిఆర్ఎస్ లెక్కలోకి తీసుకుంది. తెలంగాణలో తమ కు తప్ప మరెవ్వరికీ రాజకీయంగా అవకాశం ఉండదు అని అంచనా వేసింది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు గట్టి షాక్ కలిగించాయి ముఖ్యంగా టిఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీలకు ఇది పెద్ద కోలుకోలేని ఎదురుదెబ్బ. ఇప్పుడు పరిస్థితులు చూస్తే బిజెపిలోకి వెళ్లే నాయకుల సంఖ్య క్రమక్రమంగా పెరిగి పోతోంది.ముఖ్యంగా
తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న
విజయశాంతి బీజేపీ లోకి వెళ్లడం దాదాపు ఫిక్స్ అయిపోయి నట్లు తెలుస్తోంది. ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్లి
బిజెపి అగ్ర నేతలను కలిసి అక్కడే
బిజెపి కండువా కప్పుకునేందుకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక విజయశాంతితో పాటు
కాంగ్రెస్ కు చెందిన
తెలంగాణ కు చెందిన
ఎంపీ సైతం అదే రోజు బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చేరికల పరంపర మొదలైతే ఇంగ్లీష్ నుంచి బీజేపీలోకి చేరే వారి సంఖ్య మరింతగా ఉండే అవకాశం ఉండడంతో
కాంగ్రెస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది అలాగే టిఆర్ఎస్
పార్టీ లోని అసంతృప్తి నాయకులు సైతం బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు గా చూపిస్తున్నాడు అంటే ఈ చెరువులను ఆక్రమించి
కేసీఆర్ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ అసంతృప్తిని పొద్దున్నుంచి
పార్టీ మారుతున్న చూడాలని కీలక నేతలు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా బిజెపిలో మాత్రం ఇప్పుడు సందడి వాతావరణం నెలకొంది.