ఎల్ఐసి అదిరిపోయే పాలసీ.. 160 రూ.లతో.. 23 లక్షలు చేతికి..?
ఇక ఈ పాలసీ తీసుకోవడం ద్వారా తమ కస్టమర్లకు ఎంతో మేలు చేకూరుతుంది అని ఎల్ఐసి భావిస్తోంది. అంతేకాకుండా కస్టమర్లు ఈ పాలసీ తీసుకోవడం ద్వారా మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే ఈ పాలసీలో చేరాలనుకునే వారు ముందుగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ప్రతిరోజు తక్కువ మొత్తంలో సేవ్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఎల్ఐసి న్యూ మనీ బ్యాక్ పాలసీ లో 2ఆప్షన్లను కూడా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.
కస్టమర్లు ఈ పాలసీ యొక్క మెచ్యూరిటీ కాలాన్ని 20 లేదా 25 ఏళ్లుగా ఆప్షన్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ పాలసీ తీసుకోవడం ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇలా రోజుకు చిన్న మొత్తంలో ఆదా చేసే పాలసీలో భాగంగా డిపాజిట్ చేయడం ద్వారా దాదాపు మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత లక్షల రూపాయలు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు మీరు 28 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కాల పరిమితిలో రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే.. మీకు మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.23 లక్షలు లభిస్తాయి. రోజుకు రూ.160 ఆదా చేసి నెలకు రూ.4800 ప్రీమియం చెల్లించాలి. ఇప్పుడు మీకు ఏకంగా రూ.23 లక్షలు వస్తాయి.