ఇక జగన్ జనం బాట పడతారా ?

అంతా బాగానే ఉంది అనుకుంటున్నా.. ఏదో తేడా కొడుతుంది అని, ప్రభుత్వ పాలన పై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, మరేదో అసంతృప్తి ఉందని, నాయకుల్లో పార్టీ పైన ప్రభుత్వం పైన ప్రేమాభిమానాలు ఉన్నా, ఎక్కడో తెలియని అసంతృప్తి ఉందని, ఇలా ఎన్నో విషయాలను ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువగానే ప్రజాసంక్షేమ విషయాల పై దృష్టి పెట్టి  రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగిరవేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా చెప్పుకుంటే జగన్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు గాని , సంచలన నిర్ణయాలు కానీ , మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు అంటే అతిశయోక్తి కాదు.



 ప్రజలకు ఏం అవసరం అవుతుందో, ముందుగా గ్రహించి వాటిని అమలు చేస్తూ, జగన్ జనరంజక పరిపాలన అందిస్తూ వస్తున్నారు. అయితే ఈ సమయంలో మరింతగా బలహీన పడాల్సిన ప్రత్యర్థి పార్టీలు మరింతగా బలపడి , భయపెట్టే అంతటి స్థాయికి వెళ్లడం జగన్ కు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. తాను కష్టపడుతున్న ఫలితం రావడం లేదని, ఈ విషయాన్ని గ్రహించిన జగన్ ఇక జనం బాట పట్టాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వం లోపాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలని, వైసిపి ప్రతిపక్షంలో ఏ విధంగా అయితే యాక్టివ్ గా జనాల్లో ముద్ర వేసుకో కలిగిందో ఇప్పుడు అదే విధంగా యాక్టివ్ అవ్వాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది . 



ఈ మేరకు జనాల్లో తిరుగుతూ జన బలం మరింత పెంచుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే కాకుండా, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు ఉండడం , అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు ఆ సీటుపై కన్ను వేయడం, ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న జగన్ జనం బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: