ప్రజల్లో అసంతృప్తి ని తగ్గించినంత మాత్రాన ప్రజలు మారుతారా కేసీఆర్..?
డిసెంబరులో ghmc ఎన్నికలు జరుగుతాయని దీపావళి అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని నోటిఫికేషన్ విడుదల అనంతరం మరో రెండు వారాల్లో ఎన్నికలను నిర్వహిస్తామని సీఎం కెసిఆర్ ఇటీవలే వెల్లడించారు. ఎన్నికల ఇన్‌ఛార్జిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. దుబ్బాకలో ఊహించని రీతిలో బీజేపీ గెలిచిందని, రూరల్ ఏరియాల్లోనూ ఆ పార్టీ బలపడుతోందని, రూరల్ ఏరియా అయిన దుబ్బాకలో బీజేపీ గెలుపును ఆషామాషీగా తీసుకొవద్దని పార్టీ నేతలకు కేసీఆర్ ఇటీవలే ప్రగతిభవన్‌లో జరిగిన టీ ఆర్ ఎస్ నేతల సమావేశంలో తెలిపారు. అయితే గ్రేటర్ లో ప్రజలు కొంత అసహనంగా అసంతృప్తి ఉన్నారని కేసీఆర్ పసిగట్టి వారి అసంతృప్తి ని తగిచేందుకు కొన్ని ప్రయత్నాలుచేస్తునారు.
రెండు నెలలుగా … తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ధరణి వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రారంభమయ్యాయి. కానీ ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత తమ స్థలాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే ఎన్ని తిప్పలు పడాలో అన్న భయం వారిని వెంటాడుతోంది. గ్రేటర్ ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజల్లో ఉన్న ఈ ఆందోళనను దూరం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎప్పటి నుండి ప్రారంభించాలన్నదానిపై కేసీఆర్ త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.