బీహార్ లో బీజేపీకి భారీ షాక్.. మరో మహారాష్ట్ర కానుందా..?

praveen
భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లో కాషాయ జెండా ఎగుర వేసేందుకు ఎంతో వ్యూహాత్మకం గా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక కేంద్రం లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమర్థవంతంగా పాలన చేస్తుండడం కూడా బీజేపీ పై ప్రజల్లో మరింత సానుకూల భావన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే  ప్రజలు అందరూ బీజేపీపై ఎన్నికల్లో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బీజేపీకి భారీ మెజారిటీ కట్టబెడుతున్నారు. కానీ  అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సరిపడా  మెజారిటీ మాత్రం ప్రజలు కట్టబెట్టడం లేదు.  దీంతో మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది బీజేపీకి.



 ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు మిత్ర పక్షం కాస్త బీజేపీకి సమస్యగా మారిపోతుంది. దీంతో నోటి దాకా  వచ్చిన ముద్ద  కాస్త చేజారి పోయినట్లుగా మారిపోతుంది బీజేపీ పరిస్థితి. మహారాష్ట్రలో ఎన్నో సంవత్సరాల పాటు మిత్రపక్షంగా ఉన్న శివసేన ఒక్కసారిగా భారీ డిమాండ్లు ముందుకు ఉంచడంతో బీజేపీ అంగీకరించలేదు. ఆ తర్వాత బీజేపీ నుంచి వేరుపడి ఎన్సీపీ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. బిజెపి పార్టీకి మహారాష్ట్రలో భారీ మెజారిటీ ఓట్లు ఉన్నది శివసేన  వేరు పడటంతో అధికారం చేజిక్కించుకోలేకపోయింది  బీజేపీ.



 ఇక ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కూడా మహారాష్ట్ర తరహా ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ బీజేపీకి షాక్ ఇవ్వబోతున్న అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది బీహార్ రాజకీయాల్లో . నితీష్ కుమార్  బీజేపీ నుంచి వేరే పార్టీలతో కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం బీజేపీతో నితీష్ కుమార్ బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: