పాకిస్తాన్ పై మరో ఎటాక్.. ఈసారి భారత్ కాదు.. ఊహించని శత్రువు..?

praveen
పాకిస్తాన్ భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది అన్న విషయం తెలిసిందే.  అయినప్పటికీ పాకిస్తాన్ ఎప్పుడు సరిహద్దు ల్లో తోకాడిస్తూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగ లో తొక్కుతూ భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఎప్పుడూ కాల్పులకు పాల్పడుతూ  ఉంటుంది అనే విషయం తెలిసిందే. అంతే కాకుండా ఉగ్రవాదుల ను భారత్లోకి అక్రమంగా పంపించేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఇటీవలే మరోసారి పాకిస్తాన్ బరితెగించి సరిహద్దుల్లో ఉగ్రవాదుల ను భారత్ లోకి పంపించేందుకు ప్రయత్నించ గా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఏకంగా భారత సైన్యంపై విచ్చలవిడిగా కాల్పులు దిగింది పాకిస్తాన్.



 ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. వెంటనే స్పందించిన భారత ఆర్మీ ఊహించని విధంగా పాకిస్తాన్ ను  దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. వెంటాడి వేటాడి మరి పాకిస్తాన్ సైనికులను కాల్చి పడేసింది  భారత సైన్యం. పాకిస్తాన్ సరిహద్దు దాటి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లి  కాల్పులు జరపడంతో పాటు పాకిస్తాన్ ఊహించని విధంగా మిస్సైల్స్ ప్రయోగించి పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో భారత్  కేవలం గన్స్  తో మాత్రమే దాడికి దిగుతుంది అని ఊహించిన పాకిస్థాన్కు భారత్ ఏకంగా మిస్సైల్స్ ప్రయోగించడంతో ఒక్కసారిగా బిత్తరపోయింది పాకిస్తాన్.


 ఇక తాజాగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా పాకిస్తాన్ ఇప్పటికే భారత దాడితో బెంబేలెత్తిపోతే  ఇక ఇప్పుడు బెలూన్  ఆర్మీ రంగంలోకి దిగిన పాకిస్థాన్ పై దాడికి దిగింది. పాంచ్ గడ్  ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు వాహనాలపై బలూచ్  ఆర్మీ దాడి చేయడంతో భారీ సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ఊహించని విధంగా భారీ షాక్ తగిలింది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ వైఖరి మార్చుకోకపోతే ఇలాంటి దాడులు మరిన్ని  జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: