కనుమరుగవుతున్న కరోనా... చివరకు జరిగేది ఇదేనా...?
మరోవైపు ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్ గా రష్యా స్పుత్నిక్ వి మన ముందుకు వచ్చింది... ఇప్పటికే ఈ వ్యాక్సిన్ హైదరాబాద్ కు చేరుకోగా... ట్రయల్స్ అనంతరం ప్రజలకు నేరుగా ఇవ్వనున్నారు...ఇలా జరుగుతుండగా మరో వైపు ప్రస్తుతం కొద్ది రోజుల నుండి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా శాతం తగ్గుతూ వస్తోంది... దీంతో వ్యాక్సిన్ రాకముందే మహమ్మారి కరోనా పూర్తిగా అంతరించి పోతుంది అని వార్త కొత్త పుకార్లు పుట్టించింది.... కాని ఇటువంటి వార్తలు వలన ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంది...
ఓ వైపు వైద్య నిపుణులు ప్రజలు కరోనా నిబంధనలు అతిక్రమించి అదుపు తప్పితే మరలా ముప్పు మొదటికి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందన్న వార్త నిజమైనప్పటికీ నిబంధనలు పాటిస్తూ ఎవరిని వాళ్లకి రక్షించుకోవడం అలాగే ఇతరులను రక్షించడం తప్పనిసరి. వచ్చే ఏడాది జనవరి నెలలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ కు చేరుకోగా అతి త్వరలోనే ప్రజలకు అందించనున్నారు.