ప్రధాని మోదీ: మధ్యతరగతి వారికి శుభవార్త...!
దీనిప్రకారం అదనంగా వీరికి పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా కలుగనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ సుప్రతిం బందోపాధ్యాయ్ మాట్లాడుతూ.. పీఎఫ్ ఆర్ డీఏ ఎన్ పీఎస్ కు సంబంధించి అందరికీ పన్ను మినహాయింపు కల్పించాలనే ప్రాతిపాదన చేస్తుందని పేర్కొన్నారు. ఆయన మాటలు ప్రజలకు కాస్త ఊరటను కలిగించాయి....ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే... నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ కు సంబంధించి కంపెనీ కంట్రిబ్యూషన్ కు ఇది వర్తించనుంది. ఎన్ పీఎస్ అకౌంట్ కు కంపెనీ 14 శాతం కంట్రిబ్యూషన్ పై పన్ను మినహాయింపు అందించాలనే ప్రతిపాదన చేస్తామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు వచ్చే బడ్జెట్ లో ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంటుందని మధ్యతరగతి వారికి తీపి కబురు అందించారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తున్న విషయం తెలిసిందే... అయితే రానున్న రోజుల్లో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్ పీఎస్ ఖాతాల కంపెనీ కంట్రిబూషన్ కు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కంపెనీకి పన్ను మినహాయింపు కల్పించాలని కేంద్రానికి తెలియజేస్తామని బందోపాధ్యాయ్ అన్నారు. ఈ కొత్త రూపకల్పనకు జీవం పోయాలని ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆయా.... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పన్ను మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అంతేకాకుండా ఎన్ పీఎస్ టైర్ 2 అకౌంట్ కు కూడా పన్ను మినహాయింపు కల్పించాలని పీఎఫ్ఆర్ డీఏ కోరనుంది. ఇటీవలనే ఈ బెనిఫిట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చింది. ఇదే బెనిఫిట్ ను ప్రతి ఒక్క సబ్ స్క్రైబర్ కు అందించాలని పీఎఫ్ ఆర్ డీఏ ఆలోచిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం వీటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో బడ్జెట్ ప్రణాళికలలో ఈ అంశాన్ని కూడా చేర్చేందుకు మోదీ సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.