విద్యార్థులు ఊపిరి పీల్చుకోండి.. ఇక ఆందోళన వద్దు.?
ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలను ప్రారంభించడం తోపాటు ఇంటర్మీడియట్ విద్యాబోధన కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. గతంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ అందరినీ పాస్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక 10వ తరగతి పాసైన విద్యార్థులు అందరికీ కూడా ఇంటర్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియపై ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రంలో పదవ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా ఇంటర్ ఫస్టియర్ లో సీటు లభిస్తుంది ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇంటర్ కోర్సు లో ఎలాంటి సీట్ల కొరత లేదు అంటూ స్పష్టం చేసిన ఆయన... ఇంటర్ లో సీట్ దొరుకుతుందో లేదో అని అటు విద్యార్థులు మరోవైపు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక కోర్టు ఉత్తర్వులకు లోబడి ఆన్లైన్ ఇంటర్మీడియట్ సీట్లు కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. కాగా ప్రస్తుతం ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సీట్లు దొరుకుతాయా దొరకవా అని ఆందోళనలో ఉన్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు చెప్పిన వార్త ఊరట కలిగిస్తుంది అని చెప్పాలి.