వేధిస్తున్న భర్త... భార్య ఏం చేసిందో తెలుసా.. అందరు షాక్..?

praveen
భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ నేటి రోజుల్లో  భార్యాభర్తల మధ్య కూడా ఇలాంటి అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఒకరిలో  కూడా సర్దుకునే గుణం లేకపోవడంతో ఎప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడుతూ ఉన్నాయి.  అదే సమయంలో భార్య భర్తల మధ్య నమ్మకం అనేది ఉండకపోవడంతో తరచూ ఒకరిపై ఒకరు అనుమానాలు పడుతూ ఉండడం తో మరింతగా మనస్పర్థలు ఎక్కువవుతున్నాయి. ఇలా నేటితరంలో భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతుంది. చాలా మంది భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతూ ఉండటం లాంటి ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.



 భార్య భర్తల బంధం లో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఎంతోమంది మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా తెరమీదికి వస్తుంటే.. మరెంతో మంది ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేసిన సంఘటనలు కూడా తెర మీదికి వచ్చి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. పెళ్ళైన  కొన్నాళ్ల వరకూ బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం భర్త భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక వివాహిత తనలో తానే కుమిలిపోతుంది. ఇక రోజు రోజుకు భర్త వేధింపులు ఎక్కువ అవుతూ వచ్చాయి.



 దీంతో చివరికి మనస్థాపం చెంది ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిన విషాదకర ఘటన మెదక్ జిల్లా ఆందోల్ మండలంలో వెలుగులోకి వచ్చింది.  సరిగ్గా ఏడాది క్రితం డాకూర్  గ్రామానికి చెందిన భాను అనే యువతికి.. గ్రామానికి చెందిన దేవయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది.  కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల నుంచి భర్త మానసికంగా శారీరకంగా భార్యను వేధిస్తూ వచ్చాడు. రోజురోజుకు భర్త వేధింపులు ఎక్కువవడంతో చివరికి భర్త వేధింపులు తాళలేక మనస్తాపం చెందిన భార్య చున్నీ తో  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: