మద్యం మత్తులో స్నేహితున్నే చంపేశారు.. చివరికి..?
ఇక్కడ ఇలాంటి ఘటన తెరమీదికి వచ్చింది. ఏకంగా స్నేహితులే అతని పాలిట యమకింకరులు గా మారిపోయారు. స్నేహితులు సమస్యలు వచ్చినప్పుడు తోడుండి... అండగా నిలుస్తారు అనుకుంటే అదే స్నేహితులు ఏకంగా చివరికి ప్రాణాలు తీశారు. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండిపోయింది. మద్యం మత్తులో జరిగిన చిన్న గొడవ కే స్నేహితులు క్షణికావేశంలో స్నేహితున్ని దారుణంగా హత్య చేసి ప్రాణాలు తీసిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్నది ఈ ఘటన.
విజయనగరంలో స్థానిక గంజి పేట వద్ద యువకులు మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఏకంగా ఒక ప్రాణం తీసింది. గొడవలో తుపాకుల వినోద్ అనే యువకుడు మృతి చెందాడు. ఇక మృతి చెందిన యువకుడు స్థానిక స్వీపర్ కాలనీకి చెందిన వాడిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ అనే యువకుడు స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే జరిగిన చిన్నపాటి గొడవతో ఆవేశానికి గురై నా మిగతా స్నేహితులు వినోద్ ను దారుణంగా కొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.