బంగారంతో పోటీ పడుతున్న ఇసుక...అన్నికోట్లు తినేశారా?
ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇసుకలో టీడీపీ నేతలు అక్రమాలకు చెక్ పెట్టేందుకు కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఇసుక ఆన్లైన్లో బుక్ చేసుకునే విధంగా తీసుకొచ్చారు. అలాగే నేరుగా ఇంటికే ఇసుక డెలివరీ చేసేలా పెట్టారు. అయితే ఇది గత టీడీపీ ప్రభుత్వం మీద పోలిస్తే కొంచెం అధిక ధర ఉంది. అందుకే దీనిపై టీడీపీ నేతలు బాగా రచ్చ చేయడం మొదలుపెట్టారు. ఇసుకలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు.
అలాగే కొంత ప్రజల దగ్గర నుంచి ఇసుకపై అసంతృప్తిగా గళం వినిపించింది. దీంతో జగన్ ఇసుక డెలివరీ మరింత పారదర్శకంగా ఉండాలని చెప్పి, ఇసుక అమ్మకాలని ప్రైవేట్ సంస్థకు ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఈ విషయంలో కేంద్ర సంస్థలు ఏవి ముందుకురాకపోవడంతో స్థానికంగా ఉండే సంస్థలకు అప్పగించాలని చూస్తున్నారు. ఇక దీనిపై కూడా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు. ఇసుకలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా, పేదలకు ఉచితంగా, పారదర్శకంగా ఇసుక ఇవ్వడానికి సిద్ధమవుతున్న జగన్పై విమర్శలు చేస్తున్నారు.
కేంద్ర రంగ సంస్థలు ముందుకూ రావని తెలిసి కూడా వైసీపీ డ్రామాలు ఆడుతుందని, రెడ్డి అండ్ కంపెనీకి ఇచ్చేందుకే ఈ డ్రామాలు అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏపీఎండీసీ లేదా? అని.. సమర్ధవంతమైన అధికారులు లేరా? అని ప్రశ్నించారు. వైసీపీ చంద్రబాబు ఇచ్చిన ఉచిత ఇసుకను బంగారం ధర చేసిందని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముకొని వైసీపీ నేతలు రూ.4 వేల కోట్లుపైనే దోచుకున్నారని, లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టారని మండిపడుతున్నారు. అయితే టీడీపీ నేతలు చేసే విమర్శల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదుగానీ, ప్రజల నుంచి మాత్రం ఇసుక విషయంలో ప్రభుత్వంపై పెద్ద వ్యతిరేకిత మాత్రం రాలేదు.