ఇమ్యూనిటీపై ఎయిమ్స్ సంచలన ప్రకటన !

NAGARJUNA NAKKA
ప్రజలందరినీ వైరస్ బారిన పడేసి ఇమ్యూనిటీ సాధించే ప్రక్రియను హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. దేశంలో కరోనా వైరస్ విషయంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే ప్రజలందరినీ  వైరస్‌ బారిన పడేలా చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రక్రియలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడమనేది ఇప్పటివరకు పరిశోధనల్లో నిరూపితం కాలేదు. ఈ నేపథ్యంలో దేశంలో హెర్డ్‌  ఇమ్యూనిటీ ప్రక్రియను పక్కకు పెట్టి, కేవలం వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే.. హెర్డ్ ఇమ్యూనిటీ కోసం అనుసరించాల్సిన  ప్రణాళికలు, సూచనలతో పాటు ప్రామాణిక పద్ధతులను అన్ని రాష్ట్రాలకు తెలియజేసింది. కరోనా వైరస్‌ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు వైరస్‌ నిర్ధారణ  పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 1768 పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 80 లక్షలకు పైనే నమోదయ్యాయి. వేల మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇంకా లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వేల మంది రికవరీ అవుతున్నారు. అదే సంఖ్యలో కొత్తగా వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే చాలా మందికి ఇన్ఫెక్షన్‌ సోకగా, వారి శరీరం వాటిని తట్టుకునే యాంటీబాడీస్‌ను వృద్ధి  చేసుకో గలిగింది. అందుకే యాంటీబాడీస్‌ ఎక్కువగా వృద్ధి చెందాలంటున్నారు. శరీరంలో యాంటీబాడీస్‌ తయారైన వారు సురక్షితంగా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు.  అయితే.. యాంటీబాడీస్‌ ఉన్న వాళ్లు కూడా మళ్లీ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని అయితే..ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఇప్పటి వరకు సరైన ఆధారాలు లభించ  లేదు.. అలాగని కచ్చితంగా వస్తుందని కూడా చెప్పలేమని అంటున్నారు.

అంతూపొంతూ లేకుండా సాగిపోతున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.31లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.5కోట్లకు చేరువైంది.  అమెరికా, యూరప్ ఖండాల్లో కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోన్న వేళ.. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్ లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం  పడుతున్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ ఇటీవలి పండుగ సీజన్ వల్ల కొత్త కేసులు మళ్లీ పెరగొచ్చని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే హెర్డ్ ఇమ్యూనిటీపై ఎయిమ్స్  సంచలన ప్రకటన చేయడం అటు కేంద్రానికి..ఇటు దేశ ప్రజల్లో ఆందోళనలు పెంచుతోంది.  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: