చైనా కి షాక్ ఇచ్చిన అమెరికా.. ఏం చెప్పిందో తెలుసా..?
ఈ క్రమంలోనే చైనాను ఎప్పటికప్పుడు నిలువరించేందుకు అటు అమెరికా ముందుకు వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో చైనాపై గుప్పించిన విమర్శలు చేసిన ఆరోపణలు అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. జో బైడెన్ వచ్చిన తర్వాత చైనాకు కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అనే టాక్ వినిపించింది. కానీ జో బైడెన్ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అన్నది అర్థం అవుతుంది. ఇటీవలే దలైలామా విషయంలో చైనా కు వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ప్రస్తుతం ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.
దలైలామాను తరిమికొట్టి పారిపోయేలా చేసిన చైనా దలైలామాను ప్రభుత్వమే నియమిస్తుంది అనే విధంగా వ్యవహరిస్తోంది. దలైలామాను ఎంపిక చేసుకునేందుకు టిబెటన్లు పాటించే సంప్రదాయాల మేరకు కాకుండా చైనా ప్రభుత్వం చెప్తున్నట్లుగా దలైలామా ను ఎంపిక చేయాలని ముందుకు సాగుతోంది. దీనిని అమెరికా తీవ్రంగా తప్పు పట్టింది. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఎంపిక చేసే అధికారం చైనాకు లేదు అంటూ తేల్చి చెప్పింది. బౌద్ధ మతస్తులు వారి సంప్రదాయాల ప్రకారం దలైలామా ఎంపిక చేసుకుంటారని... దలైలామాను ఎలా ఎంపిక చేయాలని అని నిర్ణయించే హక్కు చైనాకు లేదు అంటూ తేల్చి చెప్పింది. ఇలా అమెరికా తరపున చైనా కు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది.