జీహెచ్ఎంసీ ఎన్నికలలో టిడిపి తొలి జాబితా విడుదల...!

VAMSI
జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటరిగా పోరాడేందుకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ. 150 డివిజన్లలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో టిడిపి నేతలు మంతనాలు జరుపుతూ నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే.... అయితే ఇప్పుడు తాజాగా 90 మంది అభ్యర్థులు వివరాలతో తొలి జాబితాను ప్రకటించింది. టిడిపి ఈ జాబితాను అధికారికంగా విడుదల చేయగా.... అభ్యర్థులు ఎవరన్న క్లారిటీ రివీల్ అయింది. అన్ని రకాలుగా ఆలోచించి ముఖ్యంగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థుల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని, వారి సేవా గుణాన్ని అదేవిధంగా ప్రజల అభివృద్ధి పట్ల వారికి ఉన్న మక్కువను పరిశీలించి.... ఇలా అన్ని విధాలుగా సమర్థులైన అభ్యర్థులను ఎంచుకున్నట్లు తెలియజేసింది టీడీపీ.
ఇక ఎన్నికల ప్రచార విషయానికొస్తే.... టిడిపి నేతలు తమ జోరు చూపిస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ నేతలు తమ సత్తా చాటుతున్నారు. టిడిపి ఉంటేనే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని... ఎప్పటి నుంచో హైదరాబాద్ కు టీడీపీ కి మధ్య అవినాభావ సంబంధం ఉందని... హైదరాబాద్ పట్టణం ఎదుగుదలకు టిడిపి ఎంతగానో కృషి చేసిందని. టిడిపి కార్యకర్తలు 24 గంటలు ప్రజా సేవకు అందుబాటులో ఉంటారని.... సర్వదా ప్రజలకు అండగా నిలబడే టిడిపి ని గెలిపించడం మన బాధ్యత అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక్కసారి టిడిపి అభ్యర్థులను గెలిపించి చూడండి.
 ప్రతి కుటుంబ అభివృద్ధిలో మేము భాగమై ఉంటామంటూ హామీలు ఇస్తున్నారు. అభ్యర్థుల జాబితాను విడుదల చేసే సందర్భంగా మీడియాతో మాట్లాడిన టిడిపి నేతలు ప్రస్తుతం హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందింది అంటే... అందుకు కావలసిన వనరులను ప్రతిదీ టిడిపి కార్యకర్తలు అహర్నిశలు కష్ట పడితేనే సాధ్యమైంది అంటూ గుర్తు చేశారు. అటువంటి టిడిపి పార్టీని గెలిపించి మన హైదరాబాద్ ను మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని విన్నవించారు. ముందు ముందు జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిడిపి ఏ విధంగా ప్రచార కార్యక్రమంలో ముందుకు వెళుతుంది అనేది సస్పెన్స్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: