కరోనా ప్రభావం: రాష్ట్రంలో నవంబర్ 30 వరకు స్కూల్స్ క్లోజ్...?

VAMSI
కొన్ని రాష్ట్రాలలో తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభణ కొనసాగిస్తోంది కరోనా వైరస్. విలయ తాండవం చేస్తూ ప్రపంచ దేశాలను మళ్లీ కలవరపెడుతోంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే పలు దేశాల్లో వ్యాపించిందని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అటు ఢిల్లీ మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేసేందుకు రాష్ట్రాల్లో పూర్తి కరోనా నిబంధనలు మళ్లీ మొదలు కానున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌తో యూరప్‌ దేశం గజగజ లాడుతోంది . అంతేకాదు ప్రపంచంలోని చాలా దేశాల్లోకి ఇది ఎగబాకుతోంది. ఫ్రాన్స్, లండన్‌లో ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. అమెరికా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

ఇటువంటి తరుణంలో ఇక మన దేశం విషయానికి వస్తే కొన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గినా మిగిలిన రాష్ట్రాలలో సెకండ్ వేవ్ గా తన జోరు చూపుతోంది. అటు హర్యానా రాష్ట్రం కూడా అప్రమత్తమై కోవిడ్ సెకండ్ వేవ్ ను కట్టడి చేసేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ను అదుపుచేసే చర్యలలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్స్‌ను నవంబర్ 30 వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేస్తూ ప్రకటనను విడుదల చేసింది. రానున్న రోజుల్లో నిబంధనల డోస్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

వ్యాక్సిన్ వచ్చేంతవరకు ఈ కరోనా తిప్పలు తప్పేలా లేవు.... వ్యాక్సిన్ వస్తే తప్ప గతంలో లాగా ప్రపంచ దేశాలు స్వేచ్ఛగా తిరిగే సూచనలు కనిపించడం లేదు. కరోనా నియంత్రణ కోసం ఇతర రాష్ట్రాలు కూడా కోవిడ్ నివారణ చర్యలను ఇంకాస్త పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా విజృంభణ తరువాత ప్రారంభమైన పాఠశాలలు అంతలోనే మూతపడడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. డిసెంబర్ నుంచి అయినా పిల్లలను తిరిగి పాఠశాాలకు పంపడానికి సుముఖత చూపుతారా అన్న సందేహం ఉంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: