కల నెరవేరింది.. తండ్రి ఊపిరి ఆగిపోయింది.. కడచూపు దూరమైన భారత క్రికెటర్..?

praveen
క్రికెట్ అనే ఫ్యాషన్ ఆటగాnni ముందుకు నడిపించింది.. ఆటో డ్రైవర్ గా పని చేస్తూనే తండ్రి కొడుకును  ఉన్నత శిఖరాలకు ఎదిగే ఎందుకు ఎంతగానో ప్రోత్సహించాడు. ఇక ఒక్క ఐపీఎల్తో అతని జీవితం మారిపోయింది అన్న విషయం తెలిసిందే.ఒక్క  రోజుతో ఐపీఎల్ సూపర్ స్టార్ గా మారిపోయాడు హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ . హైదరాబాద్లోని ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐపీఎల్ వేలంలో 2.6 కోట్లకు అమ్ముడు పోవడం.. తో అందరి చూపు అతని పైన పడింది. ఇక ఇటీవలే  కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో తొలి రెండు ఓవర్లు మెయిడెడ్ గా  వేసిన మహమ్మద్ సిరాజ్ .. 2 వికెట్లు పడగొట్టి 13 ఐపీఎల్ సీజన్ లో చరిత్ర సృష్టించాడు.



 ఇక దీంతో భారత క్రికెట్ ప్రేక్షకులందరూ చూపును ఆకర్షించాడు సిరాజ్. దీంతో ఎన్నో రోజుల నుంచి అతనికి అందని ద్రాక్షల ఉన్న భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. భారత సెలెక్టర్లు నుంచి ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ కోసం పిలుపు వచ్చింది. భారత జట్టుకు ఆడాలి అన్నదే సిరాజ్ తండ్రి యొక్క కల. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్  ఆటగాడు సిరాజ్ తండ్రి యొక్క కల నెరవేరింది కానీ... అంతలోనే సిరాజ్ తండ్రి తుదిశ్వాసవిడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మహమ్మద్ గౌస్ ఇటీవలే తుది శ్వాస విడిచారు,


 కాగా ప్రస్తుతం టీం బయో సెక్యూర్ బబుల్ నిబంధన ప్రకారం సిరాజ్ హైదరాబాద్ కు  వచ్చే అవకాశం లేదు. దీంతో తండ్రి కల నెరవేర్చిన సిరాజ్ కనీసం కడ  చూపు కూడా నోచుకోలేక పోతున్నాడు. దీంతో బరువెక్కిన హృదయంతో నే టీమిండియా తరపున పోరాడేందుకు సిద్ధమవుతున్నాడు సిరాజ్. గతంలో అనారోగ్యం బారిన పడి తన తండ్రి చికిత్స తీసుకొని కోలుకొని ఇంటికి వెళ్లినట్లు తన కుటుంబీకులు ఫోన్లో చెప్పడం తో ఎంతో సంతోష పడి పోయిన మహమ్మద్ సిరాజ్ కు కొన్ని  రోజుల్లోనే విషాదకరమైన వార్త విని పించింది.  నాన్న చనిపోయాడనే వార్త తనను షాక్ కి గురిచేసింది.. లైఫ్ లో అతిపెద్ద సపోర్ట్ కోల్పోయాను.. దేశం తరఫున ఆడాలనే మా నాన్న కల.. టీమిండియాను ఎంపిక కావడం నాకు సంతోషం కలిగించి ఉంటుంది అంటూ ఆస్ట్రేలియా నుంచి సోషల్ మీడియా వేదికగా  స్పందించారు మహమ్మద్ సిరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: