దేవుడా: 80 ఏళ్ల వయస్సులో మళ్లీ పెళ్లి.. హాజరైన ముని మనవలు..!

N.ANJI
మనకు తెలిసినంత వరకు పెళ్లిని ఇరవై ఐదు, ముప్పై సంవత్సరాలో చేసుకుంటారు. ఇక జీవితంలో దాదాపు అందరూ ఒక్కసారి తప్పనిసరిగా పెళ్లి చెసుకుంటారు. అయితే రెండు సార్లు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది. అందులోనూ 70 ఏళ్లు పైబడిన తర్వాత పెళ్లి అంటే ఇదేమి విడ్డూరం అంటూ ఉంది కదా. మహరాష్ట్ర యవాత్మాల్ జిల్లాలోని ఖండాలా గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఈ అరుదైన రీతిలో విహహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. నవంబరు 16, 17వ తేదీల్లో జరిగిన ఈ పెళ్లి.. మనుమలు, మునిమనుమల సమక్షంలో జరిగింది. 65 ఏళ్ల తర్వాత వివాహానికి సంబంధించిన అన్ని ఆచారాలను పాటిస్తూ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహరాష్ట్ర యవాత్మాల్ జిల్లాలోని శ్రీరామ్ హివ్రాలే(81), నిర్మలా ఇంగోల్(71) మొదటిసారి 1955 నవంబరు 16న వివాహం చేసుకున్నారు. అప్పటికి వారిద్దరు మైనర్లు కావడం గమనార్హం. ఈ ఏడాదితో వారి పెళ్లి జరిగి 65 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే వివాహం గురించి వారికి పెద్దగా గుర్తు లేకపోవడంతో తామంతా కలిసి మళ్లి పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు పెద్ద కుమారుడు పండ్లిక్ తెలిపారు. రెండో సారి జరిగిన ఈ పెళ్లికి పెద్ద కుమారుడితో పాటు వారి చిన్న కొడుకు పండిట్, పెద్ద చెల్లి తులిజా, కూతురు, మనుమలు హాజరయ్యారు. వివాహాలకు గోల్డెన్, సిల్వర్ జూబ్లీ నిర్వహించడం మనదేశంలో కొత్తేమి కాదు. అయితే ఈ పెళ్లికి మాత్రం ప్రత్యేకత ఉంది.

ఇక తమకు పెళ్లి చేయాలనే ఆలోచన తమ కుమార్తదే అని వృద్ధ దంపతుల చిన్నకుమారుడు పండిట్ అన్నారు. కుటుంబ సభ్యులకు వెంటనే అంగీకరిచండంతో ఈ వేడుకను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ చదువు, విజయం కోసం ఎన్నో కష్టాలు పడ్డారని, వారికి అభినందనలు తెలిపేందుకు ఈ ప్రత్యేకమైన వివాహ తంతును నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ వివాహానికి కేవలం 50 మందిని మాత్రమే ఆహ్వానించారు. కోవిడ్-19 ప్రభావంతో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: