ఈ జనరేషన్ లో అంతా అజ్ఞానంలో ఎవరు లేరు..వైసీపీ ఎంపి కీలక వ్యాఖ్యలు..!!
అయితే మరొకసారి టీడీపీ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా పై పలు వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.ఈర్ష, ద్వేషాలతో రగిలిపోయేవారు ఎవర్నైనా అప్రతిష్ట పాలు జేయాలి అంటే ఒకప్పుడు ఆకాశ రామన్న పేరుతో కరపత్రాలు వేయించి వదిలేవారు అని తెలిపారు.
అయితే అది కొందరు నిజమే అని నమ్మే పరిస్తితి ఉండేది అని అన్నారు. అయితే ఇప్పుడు అంత అజ్ఞానం ఎవరికి లేదు అని తెలిపారు.ప్రస్తుతం ఈ జనరేషన్ లో రెప్పపాటులోనే ప్రపంచంలో ఏ ములా ఏం జరిగిన ప్రతిఒక్కరికి తెలిసిపోతుంది.అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.