కూతురికి ఎంతకీ పెళ్లి కుదరడం లేదని.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా.. అందరూ షాక్..?

praveen
చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. ఎంతో విలువైన ప్రాణాలను చిన్న చిన్న కారణాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది. రోజురోజుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.



 ఇప్పటికీ కూడా కూతురు పెళ్లి ని భారంగా భావిస్తున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు. ఇక్కడ ఓ తల్లి ఇలాగే భావించింది. తన  కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నది మహిళ. కూతురికి పెళ్లి చేయడం కోసం ఎన్నో పెళ్లి సంబంధాలు కూడా చూసింది. కానీ ఒక్క సంబంధం కూడా సెట్ కావడం లేదు. దీంతో తమ చుట్టుపక్కల ఉన్న అందరూ యువతులకి పెళ్లి జరుగుతుంది కానీ తమ కూతురికి పెళ్ళి జరగడం లేదు అని మనస్థాపం చెందినది  సదరు మహిళ. చివరికి కఠిన  నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.



 కూతురికి పెళ్లి కుదరడం లేదు అని మనస్థాపానికి గురైన మహిళ కఠిన నిర్ణయం తీసుకొని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని వాసవి నగర్ కు చెందిన చింతల శ్రీమతి అనే 48 ఏళ్ల మహిళ తన కూతురికి పెళ్లి చేయడానికి ఎన్నో సంబంధాలు చూసింది కానీ పెళ్ళి మాత్రం కుదరడం లేదు. దీంతో తన కూతురికి పెళ్లి కుదరడం లేదు అనే కారణంతో మనస్థాపం చెందింది  సదరు మహిళ. కొన్ని నెలలుగా మానసిక ఆందోళన లో మునిగి పోయిన సదరు మహిళ ఇటీవలే సమీపంలోని బంగ్లా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే మృతదేహం బయటపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: