సిబిఐ దెబ్బ: పాపం వైసీపీ కార్యకర్తలు

ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ నేతలు అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్న వైసిపి కార్యకర్తలు న్యాయవ్యవస్థ విషయంలో వెనకా ముందు ఆలోచించకుండా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సిబిఐ విచారణ మొదలైంది.  హైకోర్టుని వైసీపీ నేతలు తక్కువ అంచనా వేశారని దీనితో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. నేతల అండ చూసుకునే వైసీపీ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు సిబిఐ విచారణ మొదలైన సంగతి తెలిసిందే దీనితో వైసీపీ కార్యకర్తలలో కూడా ఆందోళన మొదలైంది. సిబిఐ విచారణలో చాలా మంది వైసీపీ కార్యకర్తలను విచారించే అవకాశాలు ఉండవచ్చు. న్యాయవ్యవస్థ విషయంలో వెనకా ముందు ఆలోచించకుండా విమర్శలు చేసి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. సిబిఐ విచారణ కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతలు కూడా వారిని కాపాడాలని పరిస్థితి ఉండదు. న్యాయవ్యవస్థ విషయంలో చాలామంది జాగ్రత్తగా ఉంటూ ఉంటారు.
చట్టాలు అలాగే రాజ్యాంగం అనే కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అనేది ఉంది. దీనితో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా సరే నోటి దురుసు తనం అనేది న్యాయవ్యవస్థ విషయంలో పనికిరాదు. విపక్షాలను ఎంత విమర్శించినా సరే కొన్ని కొన్ని రాజ్యాంగ వ్యవస్థలు చట్టాల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. మరి ఇప్పుడు ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సిబిఐ విచారణలో వైసీపీ నేతలను కూడా విచారిస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కూడా త్వరలోనే విచారణ కు వెళ్లే అవకాశం ఉంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: