ఇమ్రాన్ కి భారీ సంక్షేమం.. అన్ని ఊహించని షాక్ లే..?
ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదమే పాకిస్థాన్ కి ఒక సమస్యగా మారుతుంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే పాకిస్తాన్లో ఉన్న ఫ్రాన్స్ దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు అన్న విషయం తెలిసిందే. ఈ దాడిలో కీలక పాత్ర వహించిన కదీం హుస్సేన్ రిజ్వి ని తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇక సదరు వ్యక్తిని కాల్చి చంపడం పై పాకిస్తాన్ లో సరికొత్త చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం ఉగ్రవాదుల్లో కూడా ఎన్నో గ్రూపులు ఏర్పడ్డాయి అన్నది అందరికీ అర్థమైంది.
ఈ క్రమంలోనే ఇటీవలే కదీం హుస్సేన్ రిజ్వి అంత్యక్రియల సందర్భంగా లక్షలాది మంది జనాలు అంత్యక్రియలకు హాజరయ్యారు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కి కొత్త తలనొప్పి గా మారిపోయింది. ఒకవైపు మతతత్వ వాదులు పాకిస్తాన్ ప్రభుత్వం పై తిరగబడుతూ ఉంటే మరో వైపు బెలూచిస్తాన్ ప్రజలు ప్రభుత్వంపై ప్రస్తుతం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తిరగబడుతున్నారు. గిల్గిట్ బాల్టిస్థాన్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తిస్థాయిలో ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారు. సైన్యంలో ఇమ్రాన్ మాట చెల్లుబాటు కావడం లేదు. ఇలా పాకిస్తాన్ లో ఎన్నో రకాలుగా సంక్షోభం ఏర్పడుతుంది అని విశ్లేషకులు అంటున్నారు.