చివరకు వైఎస్ఆర్ కూడా జగన్ లా చేయలేదు..

Deekshitha Reddy
అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఏపీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలో జరగని పనుల్ని, జరిగేందుకు ఎవరూ ఊహించని పనుల్ని చేపట్టారు. కేవలం ఏడాదిన్నరలోనే వాటిని ఓ కొలిక్కి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థతో దేశ రాజకీయాల్లోనే తనదైన ముద్రవేశారు సీఎం జగన్. ఆ ముద్రను పక్కాగా మార్చేందుకు.. సచివాలయ భవనాలన్నిటినీ పక్కా భవనాలుగా, శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. దీనికోసం వైసీపీ సర్కారు వెచ్చిస్తున్న మొత్తం అక్షరాలా 3,825.15 కోట్ల రూపాయలు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సచివాలయాల భవనాలకోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం, సచివాలయాన్నిటినీ పక్కా భవనాల్లోకి మార్చేస్తున్న ప్రభుత్వం లేదంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ గ్రామాలకు శాశ్వత ఆస్తులుగా మారబోతున్నాయనడం మరింత సంతోషకరమైన వార్త.
వైసీపీ అధికారంలోకి వచ్చాక స్థానికులు చీటికి మాటికి పట్టణాలకు వెళ్లకుండా.. గ్రామాల్లోనే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలకు పక్కా శాశ్వత భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. తద్వారా గ్రామాల్లో ఆస్తిని సమకూర్చుతోంది. ఇందుకోసం రూ.3,825.15 కోట్లను వెచ్చిస్తోంది. గ్రామాల్లో శాశ్వత మౌలిక వసతులకు ఒక్క గ్రామ సచివాలయాలపైనే ఇంత మొత్తం ఖర్చు చేయడం రాష్ట్ర  చరిత్రలో ఇదే తొలిసారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు భవన నిర్మాణాలతో గ్రామాలకు కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. అటు శాశ్వత నిర్మాణాలు, ఇటు స్థానికులకు పని.. రెండో ఒకేసారి సమకూరుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల భవన నిర్మాణాల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుంది. బిల్లులు చెల్లించక ఎక్కడా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు ఆగిపోలేదని, ప్రతివారం సచివాలయాల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహిస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ఇలాంటి శాశ్వత నిర్మాణ పనులు జరగలేదని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: